మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ ఆగలేదు. సిబిఐ అధికారులు కరోనా బారిన పడటంతో విచారణ ఆగింది అని భావించారు. కాని మళ్ళీ విచారణను కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది సిబిఐ. నేటి నుంచి వివేకా హత్య కేసు విచారణ కొనసాగుతుంది. సీబీఐ బృందంలో ఏడుగురికి కరోనా సోకడంతో బ్రేక్ పడ్డ విచారణ మళ్ళీ మొదలు పెడుతున్నారు.
దీనితో రంగంలోకి మరో కోత్త బృందం దిగింది. సీబీఐ బృందంలోని 15మంది సభ్యుల్లో ఏడుగురికి కరోనా సోకింది. ఐసోలేషన్ కేంద్రాల్లో చికిత్స పొందుతున్నారు ఏడుగురు సభ్యులు. వివేకా హత్య కేసు విచారణకు బ్రేక్ పడటంతో వారి స్థానాల్లో కోత్త టీమ్ ని ఏర్పాటు చేసారు. డిల్లీ నుంచి కడపకు రానుంది కోత్త సీబీఐ బృందం. నేడు కడపకు చేరుకునే అవకాశం ఉంది. సీబీఐ అధికారులు కడపకు చేరుకున్నాక యధావిధిగా విచారణ కోనసాగే అవకాశం ఉంది.