N440k కోవిడ్ వేరియంట్ అంటే ఏమిటి…? సిసిఎంబి ఏం చెబుతోందంటే…?

-

N440k అనే కొత్త వేరియంట్ కారణంగా కరోనా కేసులు ఎక్కువగా చూస్తున్నాం. ముఖ్యంగా ఇవి దక్షిణ భారత దేశంలో ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో N440k మ్యుటెంట్ ని చూస్తున్నాము. అయితే రిపోర్టుల ప్రకారం విశాఖపట్నం, కర్ణాటక, తెలంగాణ మరియు కొన్ని దక్షిణ ప్రాంతాల్లో కేసులు తీవ్రంగా వస్తున్నాయి.

ఈ వైరస్ మహారాష్ట్ర మరియు చత్తీసుగఢ్ లో కొన్ని ప్రాంతాలలో ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అసలు N440k అంటే ఏమిటి అనేది చూస్తే…? N440k అనేది ఒక వేరియంట్. దీని కారణంగా కోవిడ్ లో తీవ్రమైన కాంప్లికేషన్స్ వస్తున్నాయి. రిపోర్టు ప్రకారం మామూలు వైరస్ కంటే ఇది 15 రెట్లు ఎక్కువగా ఉంటుంది.

వారం దాటిన తర్వాత పరిస్థితి తీవ్రంగా ఉంటుంది. N440k కొద్ది సేపట్లోనే నలుగురు వరకూ సోకే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీని కోసం సీసీఎంబీ ఏం చెప్పిందంటే…? హైదరాబాద్ బెస్ట్ సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ N440k కోసం పరిశీలించాక ఇది చాలా ప్రమాదకరమని తెలుస్తోంది.

ముఖ్యంగా దక్షిణ భారత దేశం లో ఉన్నట్లు రీసెర్చ్ లో తెలిసింది. అయితే పలు పరిశోధనలలో N440k యుకె లేదా డబల్ మ్యుటెంట్ తో పాటు కంపేర్ చేయలేదని మొదట వచ్చిన వైరస్ తో మాత్రమే చూసామని అన్నారు. ఏది ఏమైనా కరోనా వైరస్ రాకుండా ఉండడానికి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని.. మాస్కు ధరించి, సోషల్ డిస్టెన్స్ పాటించాలని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news