కూరగాయలు కొనేటప్పుడు ఫ్రెష్ గా ఉన్నాయో లేదో ఇలా చెక్ చేసుకోండి…!

-

తాజా కూరగాయలు తీసుకుంటే మంచిది. చాలా మంది కూరగాయలు కొనేటప్పుడు వాటిని చెక్ చేసి తీసుకుంటారు. ఇలా చెక్ చేసుకుని తీసుకోవడం మంచిది. అయితే కూరగాయల ఫ్రెష్ గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చెయ్యాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఎప్పుడైనా మీరు కూరగాయలు కొనడానికి మార్కెట్ కి వెళ్ళినప్పుడు తప్పకుండా ఇది ఉపయోగ పడుతుంది.

కూరగాయల్ని ప్రెస్ చేసి చూడండి:

మీరు ఏమైనా కూరగాయలు కొనేటప్పుడు ప్రెస్ చేసి కొనండి. టమాటా, ఉల్లిపాయ, బంగాళదుంప లేదా క్యారెట్ ఏమైనా సరే వాటిని కొద్దిగా ప్రెస్ చేయండి. నెమ్మదిగా మాత్రమే ప్రెస్ చేయాలి గుర్తుంచుకోండి. ఇలా కూరగాయల్ని నొక్కి చూడడం వల్ల అవి పాడైపోయాయ లేదా మీకు తెలిసిపోతుంది.

కట్ అయిపోయిన కూరగాయల తీసుకోవద్దు:

ఎప్పుడైనా గమనించినట్లయితే కూరగాయలు మీద చిన్నపాటి రంధ్రం లేదా చిన్న కట్ ఉంటాయి. అలా ఉండే వాటిని కొనుగోలు చేయడం మంచిది కాదు.

బెండకాయలు, టమాటాలుని ఇలా చూడండి:

మీరు బెండకాయలు ముచికని విరిస్తే సులువుగా బ్రేక్ అయిపోతే అవి ఫ్రెష్ అని అర్థం. ఒకవేళ అది బ్రేక్ అవ్వలేదు అంటే అవి మంచిది కాదని అర్థం. అలానే టమాటాలు కి నల్ల మచ్చలు లాంటివి ఉంటూ ఉంటాయి వాటిని తీసుకోవద్దు.

అదే ఒకవేళ ప్యాకేజ్ వెజిటేబుల్స్ ని తీసుకున్నప్పుడు వాసన చూసి తీసుకోండి. చాలా మంది ఎక్కువ కూరగాయల తీసుకుని ఫ్రిజ్ లో స్టోర్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఇది మూడు నుంచి నాలుగు రోజుల వరకు తాజాగా ఉంటాయి. కాబట్టి అవసరాన్ని బట్టి ఎప్పటికప్పుడు కొనుగోలు చేయండి.

 

Read more RELATED
Recommended to you

Latest news