విజయవాడ కాల్పుల కేసు : మహేష్ ఫ్రెండ్ హరి కారులో వచ్చే !

-

ప్రశాంతంగా ఉన్న విజయవాడలో కాల్పుల కలకలం చెలరేగిందన్న సంగతి తెలిసిందే. విజయవాడ పోలీస్‌ కమిషనరేట్‌ లో పని చేస్తున్న మహేష్ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. మొన్న అర్థరాత్రి ఈ ఘటన జరిగింది. నిందితుడు మహేష్ గత కొన్ని రోజులుగా భూ వివాదాల్లో జోక్యం చేసుకుంటున్నట్లు అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ కాల్పుల ఘటనలో పోలీసులు కీలక సాక్ష్యాధారాలను గుర్తించారు.

నిందితుల సీసీటీవీ ఫుటేజ్‌ను గుర్తించారు పోలీసులు. మహేష్‌పై కాల్పులు జరిపిన ఇద్దరు దుండగులు మహేష్‌ స్నేహితుడైన హరి కారులోనే పరారయ్యారు. ఘటనా స్థలానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముస్తాబాద్‌ లో ఈ కారు వదిలేసి వెళ్లి పోయారని గుర్తించారు. వాళ్లి ద్దరూ పాత నేరస్తులై ఉండొచ్చని అనుమానిస్తున్న పోలీసులు ఇద్దర్నీ గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు మహేష్‌ స్నేహితులను ప్రశ్నించడంతో పాటు… అతని కాల్‌ డేటాను విశ్లేషిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news