చంద్రుడి దక్షిణ ధృవంపై చంద్రయాన్-3 అడుగుపెట్టిన క్షణాలు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హైదరాబాద్‌లోని బిర్లా ప్లానిటోరియంలో వీక్షించారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంపై ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ఆదర్శ్ నగర్‌లోని బీఎం బిర్లా ప్లానిటోరియంలో చంద్రయాన్-3 చారిత్రక ప్రయోగాన్ని వీక్షించినట్లు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం ట్వీట్ చేయగా తమిళిసై రీట్వీట్ చేశారు. భారత్‌కు అపురూపమైన విజయమని, చంద్రయాన్-3 చంద్రుడిపై విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ అయినందుకు నేను, భారత ప్రజలు గర్విస్తున్నామని, ఇస్రోకు, అందరికీ నా శుభాకాంక్షలు అంటూ ఏపీ సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
చంద్రయాన్ 3 ఉపగ్రహ నౌక చంద్రుడిపై విజయవంతంగా సాఫ్ట్ ల్యాండ్ అవడం పట్ల టాలీవుడ్ ప్రముఖులు అభినందలు తెలిపారు. చిరంజీవి, ఎన్టీఆర్, రాజమౌళి, కల్యాణ్ రామ్, మంచు విష్ణు, సత్యదేవ్ తదితరులు ట్వీట్లు చేశారు. చంద్రయాన్ 3 విజయం పట్ల ఇస్రో శాస్త్రవేత్తలకి అభినందనలు తెలిపారు. ఇది దేశమంతా గర్వించదగ్గ విషయం అని కొనియాడారు.