ఇప్పుడు ఎన్నికలు వచ్చేశాయి.. ఎన్నికలు రాగానే వడ్ల కల్లల వద్దకు అడుక్కుతినే వారు వచ్చినట్లు చాలా మంది బయల్దేరుతారు అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎద్దెవా చేశారు. ఎన్నికలు వస్తే ఆగమాగం కావొద్దు. ఎలక్షన్లు వచ్చిన సమయంలో ప్రజలు తమ ధీరత్వాన్ని ప్రదర్శించాలి. నిజమేంది.. వాస్తవమేంది.. ఎవరు ఏం మాట్లాడుతున్నారు. నిజమైన ప్రజా సేవకులను గుర్తించినట్లు అయితే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. అభివృద్ధి కూడా బాగా జరిగే అవకాశం ఉందని కేసీఆర్ పేర్కొన్నారు.
మెదక్ జిల్లాకు సీఎం కేసీఆర్ వరాల జల్లు ప్రకటించారు. మెదక్ జిల్లా అభివృద్ధికి భారీగా నిధులు మంజూరు చేశారు. మెదక్ మున్సిపాలిటీ అభివృద్ధికి రూ. 50 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. మెదక్ జిల్లా నూతన కలెక్టరేట్, ఎస్‌పీ ఆఫీసుల ప్రారంభోత్సవం అనంతరం కేసీఆర్ జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.