సర్కారువారి పాటలో మహేశ్‌ లుక్ పై సెలబ్రిటిస్ కామెంట్స్ ?

-

రెండు డిఫరెంట్‌ షేడ్స్‌ వున్న రోల్లో కనిపించనున్నాడు. ఇందులో ఒక గెటప్ బైటకొచ్చేసింది. మంచు విష్ణు ఇచ్చిన పార్టీకి మహేశ్‌ ఫ్యామిలీ హాజరైంది. ఈ సందర్భంగా దిగిన ఫొటో చూస్తే.. మహేశ్‌ లుక్ కొత్తగా అనిపిస్తోంది. బన్నీ.. ఎన్టీఆర్.. రామ్‌చరణ్‌ సినిమా సినిమాకూ కొత్త లుక్‌తో దర్శనమిస్తారు. మహేశ్‌ మాత్రం అలా కాదు. వేసుకునే కాస్ట్యూమ్స్‌లో తప్ప ఫేస్‌లో పెద్దగా ఛేంజ్‌ కనిపించదు. ఇప్పుడు మహేశ్ లుక్ పై టాలీవుడ్ లో ఆసక్తికర చర్చ నడుస్తుంది.

మహేశ్‌ న్యూలుక్‌కు సంబంధించిన ఓ ఫొటోను ఆమధ్య ప్రముఖ ఫొటోగ్రాఫర్‌ అవినాష్‌ గోవారికర్ షేర్‌ చేశారు. ఓ యాడ్‌ షూటింగ్‌ సందర్భంగా తీసిన ఫొటో ఇది. గత ఐదేళ్లుగా షార్ట్‌ హెయిర్‌తో కనిపించిన మహేశ్‌.. అతిథి.. పోకిరి మాదిరి మరోసారి లాంగ్‌ హెయిర్‌ మెయిన్‌టేన్‌ చేశాడనిపించింది. లాక్‌డౌన్‌ టైంలో కర్లింగ్‌ హెయిర్‌తో టూ యంగ్‌గా కనిపించి.. కొడుకు గౌతమ్‌కు తమ్ముడిలా అనిపించాడు. రీసెంట్‌ ఫొటోలో మహేశ్‌ మరింత హ్యాండ్స్‌మ్‌ తయారయ్యాడు. ఫోటోను విష్ణు పోస్ట్‌ చేసి రోజు రోజుకు యంగ్‌ అయిపోతున్నాడని.. ఇలా కనిపించడానికి మహేశ్‌ మంచి హృదయమే కారణమని ట్వీట్‌ చేశారు విష్ణు.

మంచు విష్ణు ఇచ్చిన పార్టీ పుణ్యమా అని.. మహేశ్‌ లుక్‌ మరోసారి ట్రోల్‌ అయింది. అవినాష్‌ గోవారికర్‌ పోస్ట్ చేసిన ఫొటో యాడ్ కోసం అనుకుంటే.. లేటెస్ట్ స్టిల్‌ బట్టి చూస్తే.. సర్కారువారి పాట కోసమే అన్నట్టుంది. సర్కారువారి పాట షూటింగ్‌ లాంఛనంగా మొదలైనా.. రెగ్యులర్‌ షూట్‌ ఇంతవరకు మొదలుకాలేదు. ముందు అమెరికాలో ప్లాన్‌ చేసి.. కుదరకపోవడంతో.. హైదరాబాద్‌కు మార్చారు. లేటెస్ట్‌ ఇన్ఫర్మ్‌మేషన్‌ ప్రకారం నెలాఖరున దుబాయ్‌లో షూటింగ్ స్టార్ట్‌ చేస్తారట. ఎక్కడ మొదలైనా.. మహేశ్‌ మరోసారి లాంగ్‌ హెయిర్‌తో కనిపించనున్నాడు. దీని పై టాలీవుడ్ సెలబ్రిటీస్ తమకు నచ్చిన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news