దేశవ్యాప్తంగా కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తోంది. లాక్ డౌన్ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. వ్యాపార సంస్థలన్ని సుమారు 7 నెలల పాటు తెరుచుకోలేదు. అన్ లాక్ ప్రక్రియ కొనసాగడంతో ఇప్పడిప్పుడే వ్యాపారసంస్థలు తెరుచుకుంటున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు తమ విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్తను అందించింది. లీవ్ ట్రావెల్ అలవెన్స్ (ఎల్ టీ ఏ) సదుపాయాన్ని పొడిగిస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎల్‌టీఏ సదుపాయాన్ని పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు ప్రకటనలు జారీ చేసింది. అయితే ఈ సదుపాయం కేవలం ఈశాన్య ప్రాంతం, లడఖ్, అండమాన్ నికోబార్ దీవులు, జమ్మూ కశ్మీర్‌కు వెళ్లే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో రెండేళ్ల పాటు ఎల్‌టీఏ పొడిగిస్తున్నట్లు మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రభుత్వ ఉద్యోగులకు అనేక సదుపాయాలు చేకూరనున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లింపులతో కూడిన సెలవుతోపాటుగా రవాణా సదుపాయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వమే చెల్లించనున్నట్లు తెలిపింది. ప్రైవేట్ ఎయిర్‌లైన్స్‌లో ప్రయాణించినా కూడా ఈ ట్రావెల్స్ అలవెన్సులను పొందవచ్చు. కానీ, ఎకానమీ క్లాస్ టికెట్లను బుక్ చేసుకోవాలి. హాలిడేకు సంబంధించి పైన పేర్కొన్న ప్రాంతాలకు 2022 సెస్టెంబర్ 25 వరకు వెళ్లవచ్చని ప్రకటించింది. ఈ సమయంలో కేంద్రం ద్వారా రవాణా సదుపాయాన్ని కూడా పొందవచ్చు.
ఉద్యోగులు హాలిడేకు వెళ్లినప్పుడు ట్రావెల్ ఖర్చులను బిల్లుల రూపంలో పొందుపర్చినట్లయితే వాటిని మళ్లీ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ హాలిడే ట్రిప్ ను కుటుంబంతో కలిసి లేదంటే ఒంటరిగా కూడా వెళ్లవచ్చు. బిల్లలు పొందుపర్చిన తర్వాత ఎల్‌టీఏ ద్వారా చెల్లింపు మొత్తాన్ని పొందవచ్చు. డీఏ పెంపు లేని నేపథ్యంలోని ఉద్యోగులకు ఎల్‌టీఏ పొడిగింపు ఊరట కలిగించే అంశమని చెప్పుకోవచ్చు. ఈ మేరుకు మరో రెండేళ్ల పాటు కుటుంబంతో ప్రభుత్వ ఉద్యోగులు ఫ్రీ హాలిడే ట్రిఫ్ ను సంబంధిత ప్రాంతాలకు వెళ్లిరావొచ్చు.