కరోనా వైరస్ బారిన చాలా మంది టీచర్ లు పడిన నేపధ్యంలో కర్ణాటక సిఎం యడ్యురప్ప కీలక నిర్ణయం వెల్లడించారు. టీచర్ లు చాలా మంది కరోనా బారిన పడ్డారు అని కాబట్టి ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, అక్టోబర్ 12 నుండి మూడు వారాల వరకు మిడ్-టర్మ్ సెలవు ప్రకటించే ఉత్తర్వులు జారీ చేయాలని సీనియర్ అధికారులను ఆదేశించాను అని చెప్పారు.
కొనసాగుతున్న కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని, అన్ని పాఠశాలలు తరగతులు తిరిగి ప్రారంభించవద్దని ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. విద్యా గామా అనే కార్యక్రమాన్ని కూడా తాము నిలిపివేస్తున్నామని సిఎం ప్రకటించారు. అక్టోబర్ 12 నుండి 30 వరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ సెలవలను ప్రకటించింది. 34 మంది విద్యార్ధులు అక్కడి స్కూల్స్ లో కరోనా బారిన పడ్డారు.