వ‌ర్క్ ఫ్ర‌మ్ హోంను ర‌ద్దు చేసిన కేంద్రం .. అందరూ ఆఫీసుల‌కు రావాల్సిందే

-

దేశ వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ తో పాటు ఓమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి త‌గ్గుముఖం ప‌ట్టింది. దీంతో కేంద్ర ప్ర‌భుత్వం కీలక నిర్ణ‌యం తీసుకుంది. క‌రోనా కేసులు ఎక్క‌వ ఉన్న స‌మ‌యంలో కేంద్ర ప్ర‌భుత్వ‌ ఉద్యోగుల‌కు ఇచ్చిన వ‌ర్క్ ఫ్రం హోంను తాజా గా కేంద్ర ప్ర‌భుత్వం ర‌ద్దు చేసింది. దీనికి సంబంధించిన ఆదేశాల‌ను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఆదివారం జారీ చేశారు. అంద‌రూ కూడా ఆఫీసుల‌కు రావాల్సిందేన‌ని ఆదేశాలు జారీ చేశారు.

100 శాతం సామార్థ్యంతో కేంద్ర ప్ర‌భుత్వ కార్యాల‌యాలు న‌డిపించాల‌ని సంబంధిత అధికారుల‌కు ఆదేశాలను జారీ చేశారు. సోమవారం నుంచే ఉద్యోగులు కార్యాల‌యాల‌కు రావాల‌ని సూచించారు. దేశ వ్యాప్తంగా పాజిటివిటీ రేటు త‌గ్గిన నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు ఆయ‌న తెలిపారు. వ‌ర్క్ ఫ్రం హోంను పూర్తిగా ర‌ద్దు చేసిన‌ట్టు తెలిపారు. దీని నుంచి ఎవ‌రికీ మ‌నిహాయింపు ఉండ‌ద‌ని స్ప‌ష్టం చేశారు. అయితే క‌రోనా వ్యాప్తి త‌గ్గినా.. ముప్పు త‌గ్గ‌లేద‌ని ఆయ‌న అన్నారు. కాబ‌ట్టి కార్యాల‌యాల్లో ఉద్యోగులు అంద‌రూ కూడా క‌రోనా నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news