హెచ్ఐసీసీలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ప్రారంభించారు ముఖ్యమంత్రి కేసీఆర్. జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం వజ్రోత్సవ కమిటీ చైర్మన్, రాజ్యసభ ఎంపీ కే కేశవరావు మాట్లాడుతూ.. ఈ వజ్రోత్సవాలు ఎవరికి పోటీ కాదని అన్నారు. అమృత్యోత్సవాల పేరుతో కేంద్రం చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తుందన్నారు కేకే. కేంద్రం జవహర్ లాల్ నెహ్రూని విస్మరిస్తోందన్నారు.
గాంధీని చిన్న చూపు చూస్తుందని అన్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం దిగజారుతోందన్నారు కేకే. స్వతంత్ర ఉద్యమ ఆశయాలను కేంద్రం నీరుగారుస్తోందన్నారు. కేంద్రం మత విద్వేషాలు రెచ్చగొడుతుందని మండిపడ్డారు. స్వాతంత్ర స్ఫూర్తిని విస్మరిస్తుంటే నిరాశ నిస్పృహాలు కలుగుతున్నయన్నారు. ఫెడరలిజం కి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు కే కేశవరావు