బాయిల్డ్‌ రైస్‌ కొనే ప్రసక్తే లేదు.. సీఎం కేసీఆర్ ధర్నా పై కేంద్రం ప్రకటన

-

సీఎం కేసీఆర్ ధర్నా పై స్పందించింది కేంద్ర ప్రభుత్వం. గత ఖరీఫ్ లో 32 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కొన్నామని.. ఈ ఏడాది 25 శాతానికి పెంచి, 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కొనుగోలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటన చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ ఖరీఫ్ సీజన్లో 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ( 60 లక్షల ధాన్యం) కొనుగోలు చేసే అంశం పరిశీలనలో ఉందని… గత రబీ సీజన్లో ఇచ్చిన హామీ మేరకు మొత్తం వరి ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు.

రబీ లో ఎంత ధాన్యం కొనుగోలుచేసేది త్వరలో స్పష్టం చేయనున్నట్లు తెలిపింది. బాయిల్డ్‌ రైస్‌ బియ్యాన్ని కేంద్రం కొనే ప్రసక్తి లేదని క్లారిటీ ఇచ్చింది. ఉప్పుడు బియ్యం తినే రాష్ట్రాలు సొంతంగా సేకరణ చేస్తున్నాయని… జాతీయ ప్రయోజనాల రీత్యా పంట వైవిధ్యం అవసరమంటుందని స్పష్టం చేసింది. దేశంలో వరి పంట సాగు ఎక్కువైందని… దేశంలో ధాన్యం నిల్వలు పెరిగిపోతున్నాయని క్లారిటీ ఇచ్చింది. దేశంలో పప్పుధాన్యాల కొరత పెరిగిపోతుండడంతో, దిగుమతులు పెంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని… పంట వైవిధ్యం, పంట మార్పిడి ల ఆవశ్యకతపై గతంలో కేంద్రం నిర్వహించిన సమావేశంలో అన్ని రాష్ట్రాలు అంగీకరించాయని తెలిపింది కేంద్ర ప్రభుత్వం. అయునా, అన్ని రాష్ట్రాలలో వరి పంట సాగు పెరగడంతో, ధాన్యం దిగుబడులు కూడా పెరిగాయని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news