అధికార టీఆర్ఎస్ పార్టీ ఇవాళ ఇందిరా పార్క్ లో చేసిన.. ధర్నా పై గోషామహాల్ బీజేపీ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ కు ధాన్యం కొనుగోలు అంశంపై అస్సలు సబ్జెక్ట్ లేదని… అందుకే ఇలా ధర్నాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. బట్టే బాజ్ ముఖ్యమంత్రి కేరాఫ్ అడ్రస్ సీఎం కేసీఆర్ అని చురకలు అంటించారు. కేంద్ర ప్రభుత్వం.. ధాన్యం కొనుగోలు అంశంపై చాలా క్లియర్ గా ఉందని.. కానీ… తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆగ్రహించారు రాజాసింగ్.
ఇందిరా పార్క్ లో ధర్నా చౌక్ ఎత్తేసిన సీఎం కేసీఆర్.. ఇప్పుడు అక్కడే ఎలా ధర్నా చేస్తారని ఆగ్రహించారు. సొంత పార్టీ నేతలకే… అపాయింట్ మెంట్ ఇవ్వని… కేసీఆర్.. రైతుల సమస్యలపై మాట్లాడటం హస్యా స్పదంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం… ధాన్యం కొనుగోలు చేస్తామని… ఎప్పుడో చెప్పిందని… స్పష్టం చేశారు రాజాసింగ్. హుజురాబాద్ ఫలితాల అనంతరం.. టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతుందనే ఈ ధర్నాలు చేస్తున్నారని ఆగ్రహించారు.