కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్..2,065 ఉద్యోగాలు..ఐదు రోజులే ఛాన్స్..

-

నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం చక్కటి గుడ్ న్యూస్ ను అందించింది.స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) సెలక్షన్ పోస్ట్ ఫేజ్ X-2022 కోసం దరఖాస్తులను కోరుతూంది.అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ssc.nic.inల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 13లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పరీక్ష కంప్యూటర్ మోడ్‌లో ఆగస్టు 2022లో జరుగుతుంది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా దేశవ్యాప్తంగా మొత్తం 2065 ఖాళీలను ఎస్‌ఎస్‌సీ భర్తీ చేయనుంది.ఈ ఉద్యోగాల గురించి పూర్తీ వివరాలు తెలుసుకుందాం..

అర్హతలు..

సెలక్షన్ పోస్ట్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలనే అభ్యర్థి దేశంలోని ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి పరీక్షను పూర్తి చేసి ఉండాలి. అలాగే గుర్తింపు పొందిన బోర్డ్‌ నుంచి 12వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అదేవిధంగా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా స్ట్రీమ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

పరీక్షా విధానం:

క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్
జనరల్ ఇంటెలిజెన్స్
ఇంగ్లీష్‌
జనరల్ అవేర్‌నెస్/జనరల్ నాలెడ్జ్
మొత్తం 100 ప్రశ్నలు 200 మార్కులు

దరఖాస్తు విధానం:

సంస్థ అధికారిక వెబ్‌సైట్ ssc.nic.inను సందర్శించాలి.
హోమ్ పేజీలోని ఎస్‌ఎస్‌సీ క్యాండిడేట్స్ పోర్టల్‌లో అభ్యర్థులు తమ వివరాలను నమోదు చేసుకోవాలి.
ఆ తరువాత ఫేజ్ X 2022 పరీక్ష కోసం లాగిన్ అయి దరఖాస్తు చేసుకోండి.
అన్ని వివరాలతో దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి. అలాగే అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి. ఆపై దరఖాస్తు రుసుమును చెల్లించి, ఫారమ్‌ను సమర్పించండి.
దరఖాస్తు ఫారమ్ కన్ఫర్‌మేషన్ పేజీని డౌన్‌లోడ్ చేసుకోండి. అలాగే భవిష్యత్ అవసరాల కోసం ప్రింటౌట్ తీసుకోండి.
దరఖాస్తు చేసుకోవడానికి జూన్ 13, 2022 వరకు అవకాశం ఉంది.
ఆసక్తి కలిగిన విద్యార్థులు వెబ్ సైట్ లో పూర్తీ వివరాలను తెలుసుకొని అప్లై చేసుకోగలరు..

Read more RELATED
Recommended to you

Latest news