గుడ్ న్యూస్..ఎంసెట్‌, నీట్‌, ఐఐటీ ప్రిపర్ అయ్యే విద్యార్థులకు ఉచిత కోచింగ్..

-

తెలంగాణ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.ఎంసెట్‌, నీట్‌, ఐఐటీ ప్రిపర్ అయ్యే విద్యార్థులకు ఉచిత కోచింగ్ అందిస్తోంది. ఈ కోచింగ్ దరఖాస్తు కోసం ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. ఈ ప్రక్రియకు తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీగా స్పందన వస్తోంది. దాదాపుగా 20,000 మంది విద్యార్థులు ఇప్పటికే రిజిస్టర్ చేసుకొన్నారు.ప్రతి ఏడాది ర్యాంకుల ఆధారంగా కొచింగ్ ను ఇస్తారు.

ఈ ఏడాది ఎంసెట్‌, నీట్‌, ఐఐటీ, సీఏ సీపీటీ- 2022 ఆన్‌లైన్ షార్ట్ టర్మ్ కోర్సు ల కోచింగ్‌లను విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ప్రారంభించారు. జూన్ 6, 2022 ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమం ద్వారా వెనుకబడిన విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయ పడ్డారు..ఉచిత కోర్సులకు ప్రభుత్వ, ప్రభుత్వ రంగ ఇన్‌స్టిట్యూట్‌ల చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్‌ https://tscie.rankr.io/ ను సందర్శించాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకొన్న విద్యార్థులకు మాక్ టెస్టులు నిర్వహిస్తారు.

విద్యార్థులు ప్రభుత్వ, ప్రభుత్వ రంగ ఇన్‌స్టిట్యూట్‌లు, ఎయిడెడ్‌, ప్రైవేటు కాలేజీలో చదువుతున్నా సరే వారికి ఉచితంగా శిక్షణ అందిస్తారు. కోచింగ్ అందించే యంత్రాంగం విద్యార్థులకు వీడియో క్లాస్‌లు అందిస్తారు. ఈ వీడియోలను యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేస్తారని చెప్పారు.డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఈ-లర్నింగ్ తెలంగాణ పేరుతో చానెల్ ఉంటుంది.ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతున్న వారు ఈ ఫ్రీ కోచింగ్‌ను వినియోగించుకోవాలని ఆదేసించారు..ఈ కొచింగ్ వల్ల ఎంసెట్ లో మంచి ఫలితాలను సాదిస్తారని ఆకాంక్షించారు.

Read more RELATED
Recommended to you

Latest news