డబ్బులు సంపాదించాలనుకునే వారికి కేంద్రం గుడ్ న్యూస్.. ఇలా ఈజీగా అప్లై చేసుకోచ్చు..!

-

ఆదాయం పొందాలని అనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. ప్రధాన మంత్రి భారతీయ జన ఔషధ కేంద్రాలను మరింత విస్తరించాలని అనుకుంటోంది కేంద్రం. జన ఔషధి కేంద్రాన్ని కనుక ఏర్పాటు చేస్తే మంచిగా మీకు ఉంటుంది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లో 406 జిల్లాల్లో 3579 బ్లాక్స్‌లో జన్ ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేంద్రం చూస్తుంది. దీని కోసం ఆన్‌లైన్ అప్లికేషన్స్‌ను ఆహ్వానిస్తోంది.

భారత ప్రభుత్వం 2024 మార్చి నాటికి జన ఔషధి కేంద్రాల సంఖ్యను 10 వేలకు చేరాలని అనుకున్న విషయం తెలిసిందే. ఫార్మాస్యూటికల్స్ అండ్ మెడికల్ డివైజెస్ బ్యూరో ఆఫ్ ఇండియా కి జన ఔషధి కేంద్రాల బాధ్యతను అప్పగించారు. ఈ ఏజెన్సీ ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. జన ఔషధి వెబ్‌సైట్‌కు వెళ్లి ఆన్‌లైన్‌లోనే అప్లికేషన్ పూర్తి చేసి సబ్‌మిట్ చెయ్యాల్సి వుంది.

అర్హత ఉంటే డ్రగ్ లైసెన్స్ జారీ చేస్తుంది. వ్యక్తులు, నిరుద్యోగ ఫార్మసిస్ట్స్, గవర్నమెంట్ నామినేటెడ్ ఇన్‌స్టిట్యూషన్స్, ఎన్‌జీవోలు, ట్రస్ట్‌లు, సోసైటీలు ఈ వీటి కోసం అప్లై చేసుకోచ్చు. నాణ్యమైన ఔషధాలను అందుబాటు ధరలోనే ప్రజలకు అందించాలనే లక్ష్యంతో ఈ జన్ ఔషధి కేంద్రం ని స్టార్ట్ చేసారు. ట్విట్టర్ వేదికగా జన్ ఔషధి కేంద్రాల ఏర్పాటు విషయాన్ని పీఐబీ ఇండియా చెప్పింది.

మహిళలు, ఎస్సీ, ఎస్టీ, కొండ ప్రాంతాల్లోని జిల్లాలు వారికి రాయితీలు లభిస్తాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలను జన్ ఔషధి వెబ్‌సైట్‌లో చూడచ్చు. జన్ ఔషధి కేంద్రాలలో 1616 రకాల ఔషధాలు లభిస్తాయి. అలాగే 250 సర్జికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ కూడా. ఆయుష్ కిట్స్, బాలరక్ష కిట్స్, ఆయుష్ 64 ట్యాబ్లెట్స్ వంటివి కూడా ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news