టాలీవుడ్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ మల్టీస్టారర్ గా వచ్చిన పిక్చర్ RRR. ఈ సినిమా విజయవంతం అయిన నేపథ్యంలో భవిష్యత్తులో ఇంకా మల్టీస్టారర్ ఫిల్మ్స్ వస్తాయని సినీ పరిశీలకులు పేర్కొంటున్నారు. కాగా, ఒకే ఫ్యామిలీకి చెందిన తారలు సినిమాలు చేస్తే అభిమానులు చాలా సంతోష పడిపోతుంటారు.చిరంజీవి-రామ్ చరణ్ కలిసి ‘ఆచార్య’ చిత్రం చేశారు. ఈ నెల 29న మూవీ విడుదల కానుంది.
భవిష్యత్తులో ఇటువంటి కాంబోలో సినిమాలు వచ్చే అవకాశాలున్నాయి. ఇక ‘ఆచార్య’ ప్రమోషన్స్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా చెర్రీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తన బ్యానర్ లో పవన్ కల్యాణ్ సినిమా చేయాలని, బాబాయ్ బ్యానర్ లో తాను సినిమా చేయాలనే ఆలోచనలున్నాయని చెప్పుకొచ్చారు. ఈ విషయం తెలుసుకుని మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
భవిష్యత్తులో డెఫినెట్ గా ఫ్యామిలీ స్టార్స్ తోనే రామ్ చరణ్ మంచి సినిమాలు చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. మలయాళ సూపర్ హిట్ ఫిల్మ్స్ ‘డ్రైవింగ్ లైసెన్స్, బ్రో డాడీ’ రీమేక్ రైట్స్ మెగా ఫ్యామిలీ వారు తీసుకున్నారని సమాచారం. వీటిని మెగా హీరోలతోనే చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు టాక్.
పవన్ కల్యాణ్ పాత్రకు ఇందులో ఏదేని పాత్ర సరిపోతే ఆయనతో సినిమా చేసే అవకాశాలుంటాయని అంచనా వేస్తున్నారు. చూడాలి మరి..భవిష్యత్తులో ఏం జరుగుతుందో.. పవన్ కల్యాణ్ ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ లో ఉన్నారు.