గుడ్ న్యూస్.. ఆవాస ఇళ్లపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన..!

-

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2022లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కిందే వచ్చే సంవత్సరం 80 లక్షల ఇళ్లను కట్టనున్నామని తెలిపారు. ఈ ఇళ్ల నిర్మాణం కోసం కేంద్రం రూ.48 వేల కోట్లను ఖర్చు చేయనున్నట్టు చెప్పారు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఈ ఇళ్లను నగరాలు, గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వం నిర్మించనుంది అని అన్నారు.

బడ్జెట్ ని ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ వచ్చే ఆర్థిక సంవత్సరానికి లబ్దిదారులను గుర్తించి 80 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తున్నట్టు చెప్పారు. అయితే భూమి, నిర్మాణ క్లియరెన్స్‌లకు అవసరమయ్యే సమయాన్ని తగ్గించేందుకు రాష్ట్రాలతో కలిసి కేంద్రం పని చేయనున్నట్టు చెప్పారు. దీని వలన చాలా మందికి లాభదాయకంగా ఉంటుంది. అలానే ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు, మధ్య తరగతి ప్రజలకు అఫర్డబుల్ ఇళ్లను అందించడంపై కేంద్రం దృష్టి పెట్టనుందని అన్నారు.

ఆర్థిక సంవత్సరం 2020-21లో నవంబర్ 25 నాటికి 33.99 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసినట్టు చెప్పారు. పీఎంఏవై కింద 1.14 కోట్ల ఇళ్లను జారీ చేయగా.. 91.5 లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. ఇది ఇలా ఉండగా వాటిలో 53 లక్షల ఇళ్లను డిసెంబర్ 12, 2021 నాటికి పూర్తి చేసి, డెలివరీ చేసినట్టు చెప్పారు. క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ కింద ఇళ్ల రుణాలకు రాయితీ లభించిన వారిలో 17.35 లక్షల మంది లబ్దిదారులు ఉండగా.. 6.15 లక్షల మంది మధ్య తరగతికి వారే.

Read more RELATED
Recommended to you

Latest news