కేంద్ర ప్రభుత్వ స్కీముల లాభాలని పొందాలని అనుకుంటున్నారా..? అయితే ఏయే స్కీములకి అర్హులో చెక్ చేసుకోండి ఇలా..!

-

ఈమధ్య కాలంలో ప్రతి ఒక్కరూ వాళ్ళకి నచ్చిన స్కీములలో డబ్బుల్ని పెట్టాలని అనుకుంటున్నారు. దీని వల్ల భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా హాయిగా ఉండొచ్చు. మీరు కూడా ఏదైనా స్కీములో డబ్బులు పెట్టి ఆ స్కీం బెనిఫిట్స్ ని పొందాలని చూస్తున్నారా..? అయితే కచ్చితంగా మీరు ఈ విషయాలను తెలుసుకోవాలి నిజానికి చాలామందికి కేంద్ర ప్రభుత్వం అందించే స్కీములపై అవగాహన లేదు.

ఎవరు ఏ స్కీమ్ కి అర్హులు అనేది కూడా తెలియదు. మీరు కూడా ఏదైనా స్కీమ్ కి అర్హత కలిగి ఉన్నారా లేదా అనేది తెలుసుకోవాలనుకుంటే.. ఇలా ఈజీగా తెలుసుకోవచ్చు. మరి ఇక పూర్తి వివరాలు లోకి వెళ్లి పోదాం. మై స్కీమ్ పోర్టల్ ని కేంద్రం తీసుకు వచ్చింది. ఈ పోర్టల్‌ లో ప్రజలు ఏఏ ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయో తెలుసుకోవచ్చు.

అన్ని ప్రభుత్వ పథకాల వివరాలు కూడా దీనిలో వున్నాయి. ప్రభుత్వ పథకాలను సెర్చ్ చేయడానికి వేదికగా నిలుస్తోంది ఈ పోర్టల్. ఈ ఒక్క వెబ్‌సైట్‌ లోనే అన్ని స్కీమ్స్ వివరాలు కూడా వున్నాయి. ఇంగ్లీష్‌తో పాటు హిందీలో వివరాలు చూడొచ్చు. ఇక ఎలా చూడచ్చు అనేది తెలుసుకుందాం.

ముందుగా మై స్కీమ్ పోర్టల్ https://www.myscheme.gov.in/ ని ఓపెన్ చేయండి.
హోమ్ పేజీ లో Find Schemes For You మీద నొక్కండి.
ఆ తర్వాత మీ వివరాలని ఇచ్చేయండి.
సామాజిక వర్గాన్ని కూడా సెలెక్ట్ చేసి తర్వాతి పేజీ లోకి వెళ్లాలి.
దివ్యాంగులు అయితే Yes అనే దాని క్లిక్ చేయండి. లేకపోతే No మీద నొక్కండి. మైనారిటీ అవునో కాదో సెలెక్ట్ చేసి నెక్స్ట్ పేజీలోకి వెళ్లాలి. ఇలా అక్కడ అడిగిన వివరాలని ఇచ్చేయండి. ఇలా స్కీముల వివరాలని ఈజీగా తెలుసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news