ఎక్కువ వడ్డీని ఇచ్చే.. 5 కేంద్ర ప్రభుత్వ స్కీములు ఇవే..!

-

ఈ మధ్య కాలం లో ప్రతీ ఒకరు కూడ వారి యొక్క అవసరాలని దృష్టి లో పెట్టుకుని స్కీములు వంటి వాటిలో డబ్బులు పెడుతున్నారు. కేంద్రం కూడా ఇప్పటికే చాలా రకాల స్కీములని తీసుకు వచ్చింది. ఈ స్కీమ్స్ లో డబ్బులు పెడితే చక్కటి లాభాలని పొందొచ్చు. ఎక్కువ వడ్డీ కూడా వస్తుంది. మరి కేంద్రం ప్రభుత్వం అందిస్తున్న స్కీముల్లో ఎక్కువ వడ్డీ వచ్చే వాటి కోసం చూసేద్దాం.

స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్:

రిస్క్ తీసుకునే వారు మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ వంటి వాటిలో డబ్బులు ఇన్వెస్ట్ చెయ్యచ్చు. రిస్క్ వద్దనుకునే వారు బ్యాంకుల్లో డబ్బులు దయచ్చు. సురక్షితమైన ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్ కోసం చూసే వారు స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌ లో పెట్టచ్చు.

సీనియర్ సిటిజెన్స్ సేవింగ్స్ స్కీమ్స్:

ఈ స్కీమ్ కింద 8 శాతం వడ్డీ వస్తుంది. 60 ఏళ్లకు పైన వయసు కలిగిన వారు దీనిలో చేరచ్చు. ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలం ఐదేళ్లు. మరో మూడేళ్లు మెచ్యూరిటీ కాలాన్ని పొడిగించుకోవచ్చు. ఈ స్కీమ్ లో రూ. 30 లక్షల వరకు ఇన్వెస్ట్ చెయ్యవచ్చు.

సుకన్య సమృద్ధి స్కీమ్‌:

ఈ స్కీమ్ పై కూడా అధిక వడ్డీ వస్తోంది. ఈ స్కీమ్‌లో చేరితే 7.6 శాతం వడ్డీ లభిస్తోంది. పదేళ్లలోపు వయసు కలిగిన ఆడ పిల్లల పేరుపై ఈ అకౌంట్ ని ఓపెన్ చేసుకోవచ్చు. రూ. 1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. 15 ఏళ్ల వరకు డబ్బులు కట్టాల్సి వుంది. స్కీమ్ మెచ్యూరిటీ కాలం 21 ఏళ్లు.

కిసాన్ వికాస్ పత్ర:

కిసాన్ వికాస్ పత్ర లో చేరితే 7.2 శాతం వడ్డీ వస్తుంది. పోస్టాఫీస్‌కు వెళ్లి చేరొచ్చు. డబ్బులు రెట్టింపు అవుతాయి.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్:

ఈ స్కీమ్ లో డబ్బులు పెడితే పన్ను మినహాయింపు ఉంటుంది. స్కీమ్ మెచ్యూరిటీ కాలం 15 ఏళ్లు. తర్వాత ఐదేళ్ల చొప్పున టెన్యూర్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 1.5 లక్షల దాకా ఇన్వెస్ట్ చేయొచ్చు. 7.1 శాతం వడ్డీ వస్తుంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news