వడ్ల కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వంపై క్లారిటీ.. పారా బాయిల్డ్ రైస్‌కు నో

-

వడ్ల కొనుగోళ్లపై టీఆర్‌ఎస్, బీజేపీ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. రబీ పంట ధాన్యం కూడా పరిమితంగానే కొంటామని స్పష్టం చేసింది. ఎట్టి పరిస్థితుల్లో పారా బాయిల్డ్ రైస్ తీసుకోబోబని కేంద్ర ప్రభుత్వం గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటివరకు జరిగిన నిర్ణయాల ప్రకారం పారా బాయిల్డ్ రైస్ కేంద్రం కొనుగోలు చేయదని స్పష్టం చేసింది. పంటల కొనుగోలుపై ఒక్కో రాష్ట్రం డిమండు ఒక్కో విధంగా ఉంటుందని, అన్ని రాష్ట్రాలతో జరిగే సమావేవంలో చర్చించి వచ్చే ఏడాది ఎంత రబీ పంట ఎంత సేకరించాలో నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. ఇప్పటికే దేశంలో సరిపడా ధాన్యం నిల్వలు ఉన్నాయి. ఎగుమతిపై పరిశీలన చేస్తున్నామని పేర్కొన్నది. రాష్ట్రాల నుంచి ఎంత వరకు సేకరించగలమో అంత వరకే పండిచాలని సూచించింది. ఆయిల్, పప్పుధాన్యాల వంటి ప్రత్యామ్నాయ పంటలను పండించాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version