తిరుపతి జిల్లాలో ఇవాళ, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొందని… ఆ జిల్లా కలెక్టర్ హరి నారాయణ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే.. రేపు జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తూన్నామని తెలిపారు. కాబట్టి ఈ విషయాన్ని విద్యార్థులు దృష్టి లో ఉంచుకోవాలన్నారు. ఈ ఏడాది జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైందని… ఇప్పటికే చెరువులు, డ్యాంలు పూర్తిగా నిండిపోయాయని వెల్లడించారు.
ప్రజలు వాగులు, నీటి ప్రవాహాలను దాటవద్దని కోరారు. ఎన్డిఆర్ ఏఫ్ బృందాలను సిద్దంగా వుంచామని…చెప్పారు. ఇక అటు చంద్రగిరి లో భారీ వర్షం కొనసాగుతోంది. శ్రీవారిమెట్టు నడక మార్గంలో వరద ఉధృతి పెరుగుతోంది. అలాగే… కళ్యాణి డ్యామ్ కు భారీగా వరద నీరు చేరుతోంది. ప్రస్తుతం ఒక్క గేటు ద్వారా 1700 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు అధికారులు. మరో రెండు గేట్లు తెరిచేందుకు సిద్దమవుతున్నారు ఇరిగేషన్ అధికారులు. లోతట్టు ప్రాంతాల ప్రజలను మరింత అప్రమత్తం చేస్తున్నారు అధికారులు.