నేటి అభివృద్ధి చెందుతున్న సమాజంలో ఈజీ మనీ కోసం అలవాటుపడిన ఎందరో ఆకతాయిలు టెక్నాలజీ ని ఉపయోగించి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఇలాంటివి జరగకుండా ఉండడానికి కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు తగిన సూచనలను దేశ ప్రజలకు తెలియచేస్తూ వస్తోంది. ఇక తాజాగా మరో ఇంపార్టెంట్ సూచనను అందిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటనను జారీ చేసింది.. మొజిల్లా ఫైర్ ఫాక్స్ 120 .0 బ్రౌజర్ వెర్షన్ కన్నా ముందు అప్డేట్ లు వాడుతున్న వినియోగదారులకు ఒక హెచ్చరికను చెప్పింది. ఈ బ్రౌజర్ లలో కొన్ని పొరపాట్లను గుర్తించామని , వీటి వలన ముఖ్యంగా కొందరు సైబర్ నేరగాళ్లు డేటా చోరీ మరియు మాల్ వేర్ దాడులకు పాల్పడే అవకాశం ఉందని సూచించింది. వీరికి ఏ మాత్రం అవకాశం ఇచ్చినా నిషేధిత వెబ్ సైట్ మరియు నిషేధిత సమాచారాన్ని అప్లోడ్ చేస్తారంటూ గట్టిగా చెప్పడం జరిగింది.
దీని వలన మీరు చేయని తప్పులకు కూడా మిమ్మల్ని బాధ్యులుగా చేస్తారంటూ కేంద్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తగా తెలియచేసింది. మరి ఇకనైనా ఈ విషయాలలో తగిన జాగ్రత్తలు తీసుకుని అలెర్ట్ అవుతారని భావిస్తున్నాము.