వైయస్ జగన్ తాను ప్రమాణ స్వీకారం చేసిన రోజు నాడు ప్రజల పైన అధికారం చెలాయించడానికి కాదు సేవ చేయడానికి వచ్చాను అంటూ ప్రసంగించడం జరిగింది. అదే సమయంలో ప్రజా వేదిక కూల్చే ముందు దాంట్లో జరిగిన సమావేశంలో కూడా ప్రజల పై అధికారం చెలాయించడానికి కాదు సేవ చేయడానికి వచ్చాం మనం సర్వెంట్ లాగా వ్యవహరించాలి అని జగన్ పేర్కొనడం జరిగింది. కాగా ఇప్పుడు ఆ విధంగానే పరిపాలనలో జగన్ తీసుకున్న నిర్ణయాలు మరియు సంక్షేమ పథకాలు ప్రజలకు సేవచేయడానికి అన్నట్టుగానే ఉన్నాయి.
విషయంలోకి వెళితే గ్రామ వాలంటీర్ల ద్వారా ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని ప్రజల వద్దకు అన్నట్టుగా పరిపాలన సాగిస్తున్నారు వైయస్ జగన్. ఈ నేపథ్యంలో మార్చి ఫస్ట్ తారీకున వృద్ధులకు మరియు వికలాంగులకు అదేవిధంగా వితంతువులకు పెన్షన్ అందించడం జరిగింది. ఈ డబ్బుతోనే వారి జీవితం కొద్దో గొప్పో గడుస్తోంది. గత ప్రభుత్వంలో ఎండలో ఆపసోపాలు పడుతూ అష్టకష్టాలు పడుతూ పింఛన్ తీసుకోవడం కోసం చాలా కష్టపడే వాళ్ళు. కానీ వైయస్ జగన్ వీరి కష్టాలను ప్రతిపక్షంలో ఉన్న సమయంలో తెలుసుకుని ఇంటి వద్దకే పింఛన్ అందేలా పరిపాలన సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం మార్చి ఫస్ట్ ఏపీలో పింఛన్ లబ్దిదారులు గ్రామ వాలంటీర్ల ద్వారా 80% మంది ఉదయం పూట మొదటి రెండు గంటల్లో పింఛన్ ఇవ్వటం దేశవ్యాప్తంగా ఈ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ అయింది.
దీంతో చాలామంది సోషల్ మీడియాలో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మంచి ముఖ్యమంత్రిని ఎన్నుకున్నారు సరైన న్యాయం మాకు చేస్తున్నారు, జగన్ మా పెద్ద కొడుకు అంటూ కళ్ళల్లో నీళ్ళు పెట్టుకుంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో వృద్ధులకు మరియు వికలాంగులకు వితంతువులకు ఈ విధంగా ఇంటి వద్దకే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా జగన్ పరిపాలిస్తున్న నేపథ్యంలో కేంద్రంలో పెద్దలు ఏపీ ప్రభుత్వ పని తీరుపై ప్రశంసల వర్షం కురిపించారు అట.