జమ్మూ కశ్మీర్ లో ఒంటరిగానే బీజేపీ పోటీ..!

-

పార్లమెంటు ఎన్నికల సమయంలో రిజర్వేషన్ల విషయంలో బీజేపీపై తప్పుడు ప్రచారం చేసిన వ్యక్తి.. ఇప్పుడు జమ్మూకశ్మీర్ లో రిజర్వేషన్ల పై ఏం మాట్లాడతారు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జమ్మూకశ్మీర్ కు ప్రత్యేకంగా ఓ జెండా ఉండాలన్న నేషనల్ కాన్ఫరెన్స్ హామీని కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుందా? అధికారంలోకి వస్తే.. ఆర్టికల్ 370, ఆర్టికల్ 35-A తీసుకొచ్చి తద్వారా.. జమ్మూకశ్మీర్ లో అశాంతి, ఉగ్రవాదం పెంచాలన్న నేషనల్ కాన్ఫరెన్స్ ఆలోచనకు కాంగ్రెస్ మద్దతిస్తుందా అనేది దేశ ప్రజలకు చెప్పాలి అని పేర్కొన్నారు.

అంబేడ్కర్ రాజ్యాంగం వద్దు అని జిన్నా రాజ్యాంగాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి కాంగ్రెస్ మద్దతిస్తుందా.. రాహుల్ గాంధీ సమాధానం ఇవ్వాలి. ఉగ్రవాదులను విడుదల చేస్తామంటున్న ఎన్సీకి మద్దతుగా ఉంటారా? కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. పాకిస్తాన్ తో ‘సరిహద్దు వాణిజ్యం’ పేరుతో.. జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదాన్ని పెంచాలన్న నేషనల్ కాన్ఫరెన్స్ కుట్రను కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుందా.. జమ్మూ, కశ్మీర్ లోయ మధ్య వివక్ష రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తుందా అంటూ కిషన్ రెడ్డి ప్రశ్నించారు. జమ్మూకశ్మీర్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. రానున్న ఎన్నికలు మీ అభివృద్ధిని కొనసాగించే ఎన్నికలు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇక బీజేపీ జమ్మూకశ్మీర్లో ఒంటరిగానే పోటీ చేస్తుంది. పార్టీ నిర్ణయించిన సీట్లలో పోటీచేస్తాం అని కిషన్ రెడ్డి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news