కేటీఆర్ క్షమాపణ చెప్పారు.. మహిళా కమిషన్ కీలక ప్రకటన

-

ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణం పై చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ క్షమాపణలు చెప్పారని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ వెల్లడించింది. కేటీఆర్ మహిళలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు జారీ చేయగా.. శనివారం విచారణకు హాజరయ్యారు కేటీఆర్. ఈ నేపథ్యంలో కేటీఆర్ హాజరు పై  మహిళా కమిషన్ ఓ ప్రకటన విడుదల చేసింది.

తాము జారీ చేసిన నోటీసులపై కేటీఆర్ స్పందించి.. తమ ఎదుట హాజరై వివరణ ఇచ్చారని పేర్కొంది. తన వ్యాఖ్యల పట్ల కేటీఆర్ విచారం వ్యక్తం చేశారని, అధికారికంగా క్షమాపణలు చెప్పారని తెలిపింది. తన స్థాయికి తగ్గ నాయకత్వ హోదాలో ఉన్నవారు ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండకూడదని అంగీకరించారని కమిషన్ వెల్లడించింది. కేటీఆర్ క్షమాపణలను మహిళా కమిషన్ అంగీకరించిందని, భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని కేటీఆర్ కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్టు కమిషన్ తెలిపింది. ఒకవేళ మళ్లీ ఇలాంటి  వ్యాఖ్యలు పునరావృతం అయితే కమిషన్ తగిన విధంగా చర్యలు తీసుకుంటుందని హెచ్చరించినట్టు పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news