2019 లో సెంట్రల్ రైల్వే జోన్‌కు చెందిన ఇండియన్ రైల్వే టికెట్ చెకర్ ఒకరు మొత్తం 22,680 మంది టికెట్ లేని ప్రయాణికులను పట్టుకుని వారి నుంచి రూ .1.51 కోట్ల జరిమానా వసూలు చేసారు. ట్రావెలింగ్ టికెట్ ఇన్స్పెక్టర్ ఎస్ బి గాలండే గత సంవత్సరం సెంట్రల్ రైల్వేలో అత్యధిక వ్యక్తిగత ఆదాయాన్ని ఆర్జించారు. టికెట్ ఇన్స్పెక్టర్ గా పని చేస్తున్న గాలాండే సెంట్రల్ రైల్వే ఫ్లయింగ్ స్క్వాడ్ సభ్యుడుగా ఉన్నారు.
ఆయనతో పాటు సెంట్రల్ రైల్వే జోన్‌కు చెందిన మరో ముగ్గురు టిసిలు కూడా 2019 సంవత్సరంలో టికెట్ లేని ప్రయాణికుల నుంచి వసూళ్లు చేసారు. గాలండేతో పాటుగా మరో ముగ్గురు టిసిలు ఎంఎం షిండే, డి కుమార్, ముంబై డివిజన్ చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్ రవి కుమార్ భారీగా వసూలు చేసారు. రవి కుమార్ జి ముంబై సబర్బన్ నెట్‌వర్క్‌లోని ప్రయాణికుల నుండి జరిమానా వసూలు చేశారు.
16,035 మంది టికెట్ లేని ప్రయాణికుల నుండి షిండే రూ .1.07 కోట్లు, 15,234 మంది ప్రయాణికుల నుంచి డి కుమార్ రూ. 1.02 కోట్లు, రవి కుమార్ 20,657 మంది ప్రయాణికుల నుంచి రూ .1.45 కోట్లు వసూలు చేశారు. భారతీయ రైల్వే ట్రావెలింగ్ టికెట్ ఇన్స్పెక్టర్లకు దూర ప్రాంత మరియు స్థానిక రైళ్ళలో టికెట్ లేని ప్రయాణీకుల నుండి జరిమానాలు వసూలు చేయడానికి అధికారాలు ఉన్నాయి.