రూబీ హోటల్ అగ్నిప్రమాద ఘటనపై కేంద్ర రవాణా శాఖ దృష్టి

-

సికింద్రాబాద్ రూబీ హోటల్ అగ్నిప్రమాద ఘటన నేపథ్యంలో కేంద్ర బృందాలు రంగంలోకి దిగాయి. ఇటీవలికాలంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు అగ్ని ప్రమాదాలకు గురవుతున్న నేపథ్యంలో కేంద్ర రవాణా శాఖ అధికారులు అగ్నిప్రమాదం జరిగిన రూబీ హోటల్‌ ప్రాంతాన్ని సందర్శించారు. సుమారు 6గంటలపాటు ఘటనాస్థలాన్ని క్షుణ్నంగా పరిశీలించారు.

ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని, హోటల్ పరిసర ప్రాంతాలు, అగ్నికి ఆహూతైన ఎలక్ట్రిక్ వాహనాల ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల్లో మొదట ఎక్కడ మంటలు చెలరేగాయి? ప్రమాద సమయంలో బ్యాటరీలను ఛార్జింగ్ చేస్తున్నారా? అధిక ఛార్జింగ్ వల్ల మంటలు వ్యాపించాయా..? లేక బ్యాటరీ లోపం వల్ల మంటలు అంటుకున్నాయా ..? అనే వివరాలను హోటల్ నిర్వాహకులు, నిపుణులను అడిగి తెలుసుకున్నారు.

ఈనెల 12న రాత్రిపూట సికింద్రాబాద్ రూబీ హోటల్‌లో అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఎనిమిది మృతి చెందారు. మరో తొమ్మిది మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇప్పటికే నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news