మోడీ సర్కార్ సంచలన నిర్ణయం.. ఆ రాష్ట్రాలలో లో BSF పరిధి పెంపు

మోడీ సర్కార్‌ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. బీఎస్‌ఎఫ్‌ అధికార పరిధిని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రం. మన దేశ సరిహద్దలు వెంట రక్షణ విధులు నిర్వహించే బీఎస్‌ ఎఫ్‌ దశం ఇకపై పంజాబ్, పశ్చిమ బెంగాల్‌, మరియు అస్సాం రాష్ట్రాలలో ఏకంగా 50 కిమీ వరకు లోపలకు వచ్చి సోదాలు, జప్తులు చేయడంతో పాటు అనుమానిత వ్యక్తులను అరెస్ట్‌ చేయవచ్చు.

ఈ మూడు రాష్ట్రాల్లో ఈ పరిధి ఇప్పటి వరకు 15 కిమీ వరకే ఉండేది. బీఎస్‌ఎఫ్‌ చట్టంలో 2014 జులై లో పొందుపరిచిన నిబంధనలకు కేంద్ర హోం శాఖ ఈ మేరకు సవరణలు చేసింది.

పాకిస్థాన్‌ తో సరిహద్దలు కలిఇన గుజరాత్‌ లో బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది సోదాలు నిర్వహించే ప్రాంత పరిధిని 80 కిమీ నుంచి 50 కిమీ దూరానికి కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. అటు రాజస్థాన్‌ లో మాత్రం 50 కిమీ పరిధిని యథాతథంగానే ఉంచింది. అయితే.. పంజాబ్, పశ్చిమ బెంగాల్‌, మరియు అస్సాం రాష్ట్రాలలో బీఎస్‌ఎఫ్‌ పరిధి పెంచడం పై ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.