కరోనా మృతుల అంత్యక్రియలకు ప్రత్యేక గైడ్‌లైన్స్

-

ప్రాణాంతక కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తున్నది. ప్రపంచంలోని 150కి పైగా దేశాల్లో 2 లక్షలకు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మన దేశంలోనూ 150కి పైగా కేసులు నమోదయ్యాయి. ముగ్గురు కరోనా రోగులు మృతిచెందారు. ఈ నేపథ్యంలో కేంద్ర సర్కారు కరోనా మృతుల అంత్యక్రియలకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. అవేంటో చూద్దామా మరి..

ఐసొలేషన్ కేంద్రాలు లేదా క్వారంటైన్‌ సెంటర్లలో మృతదేహాలను స్వాధీనం చేసుకోవడం దగ్గరి నుంచి వాటి తరలింపు, కుటుంబసభ్యులకు అప్పగింత, అంత్యక్రియల నిర్వహణ మొదలైన కార్యక్రమాలు మొత్తం ఎలా నిర్వహించాలనే విషయాలను కేంద్రం ప్రభుత్వం మార్గదర్శకాల్లో సమగ్రంగా పొందుపర్చింది. కరోనా రోగి మరణించినప్పుడు ఆ మృతదేహాన్ని ఎలా స్వాధీనం చేసుకోవాలనే దానిపై సంబంధిత సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాలని కేంద్రం పేర్కొంది.

ఐసొలేషన్ సెంటర్‌ నుంచి మృతదేహాన్ని స్వాధీనం చేసుకోవడం, మార్చురీకి తీసుకెళ్లడం, అక్కడి నుంచి అంబులెన్స్‌లో శ్మశానానికి తరలించడం వంటి కార్యక్రమాలపై సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని ఆదేశించింది. మృతదేహం నుంచి వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి పాటంచాల్సిన నిబంధనల గురించి వివరించింది. మృతదేహాలకు నిర్దేశించిన ప్లాస్టిక్ బ్యాగుల్లోనే తరలించాలని సెంట్రల్‌ సర్కారు సూచించింది.

కరోనా విజృంభన నేపథ్యంలో అంత్యక్రియల సందర్భంగా సంప్రదాయ పద్ధతుల పేరుతో ఎలాంటి తతంగాలు నిర్వహించకూడదని కేంద్రం సూచించింది. మృతదేహంపై దండలు వేయకూడదని, తల నుంచి చిటికెన వేలివరకు ఏ మాత్రం బయటకు కనపడకుండా కప్పేయాలని మార్గదర్శకాల్లో సూచించింది. కాష్టమైనా, ఖననమైనా వైద్యుల సూచనల మేరకు నడుచుకోవాలని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news