ఆ కేంద్రమంత్రి ని ఫోన్ చేసి మరీ మెచ్చుకున్న మోడి ?? అంతా గొప్పపని ఏం చేశాడు !

-

కరోనా వైరస్ కి వ్యాక్సిన్ ఇంకా దొరకకపోవడంతో ప్రభుత్వాలు మరియు రాజకీయ నాయకులు జాగ్రత్తలు మరియు సూచనలు చేస్తున్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ వైరస్ ప్రభావం రోజురోజుకీ భూమిమీద పెరిగిపోతూ ఉంది. ప్లేగు వ్యాధి రోజులను ప్రస్తుతం తలపిస్తున్నాయి. అంతగా మనుషులను ఎటాక్ చేస్తున్న ఈ వైరస్ వల్ల చాలామంది ఇప్పటికే చనిపోవడం జరిగింది. ఇండియాలో కూడా రోజురోజుకీ ఈ వైరస్ యొక్క ప్రభావం పెరిగిపోతుంది. ముఖ్యంగా విదేశాల నుండి వచ్చే వాళ్ల వల్ల దేశంలో ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా చూపుతుంది. అయితే ఈ క్రమంలో విదేశాల నుండి వచ్చే వాళ్లకు స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోవాలని ప్రభుత్వాలు సూచిస్తున్న ఎవరూ పాటించడం లేదు. Image result for modi suresh prabhuఇటువంటి నేపథ్యంలో దీన్ని చెక్ పెట్టడం కోసం కేంద్ర మంత్రి సురేష్ ప్రభు కీలక నిర్ణయం తీసుకున్నారు. పూర్తి మేటర్ లోకి వెళ్తే సురేష్ ప్రభు ఇటీవల భారత్ తరఫున జీ20 సదస్సు ప్రతినిధిగా వెళ్లారు. సౌదీ అరేబియాలోని అల్ ఖోబర్ లో నిర్వహించిన మీటింగ్ కు ఆయన వెళ్లారు. ఇండియాకు తిరిగి వచ్చిన ఆయన.. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా కరోనా టెస్టు చేయించుకున్నారు. నెగిటివ్ వచ్చింది. అయినప్పటికీ ముందస్తు జాగ్రత్తలో భాగంగా స్వీయ నిర్బంధంలో ఉండిపోవాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం పార్లమెంటు సభ్యులు జరుగుతున్న నేపథ్యంలో తాను రాలేనని లేక కూడా రాశారు. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో పెద్ద వైరల్ గా మారింది.

 

ఏది ఏమైనా వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన శ్రద్ధ కరోనా వైరస్ విషయంలో కేంద్ర మంత్రి బాధ్యతగా వ్యవహరించడం ఇతరులకు ఆదర్శంగా ఉండటం తో అంత గొప్ప పని చేసిన కేంద్ర మంత్రి సురేష్ ప్రభు కి మోడీ ఫోన్ చేసి మెచ్చుకున్నారట. దేశంలో ఉన్న ప్రజలు కూడా కరోనా వైరస్ లక్షణాలు ఏమైనా కనిపిస్తే వెంటనే దగ్గరలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సూచనలు పాటించాలని కేంద్ర వైద్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ వైరస్ విషయంలో వ్యక్తిగత భద్రత అనేది చాలా ముఖ్యమని…ఇటలీలో ప్రభుత్వాలు ఎన్ని సూచనలు ఇచ్చినా గాని ఆ దేశ ప్రజలు పాటించలేదని అందువల్ల ఆ వైరస్ ఆ దేశంలో భయంకరంగా వ్యాప్తి చెందిందని ఈ విషయంలో భారతీయులు ప్రభుత్వానికి సహకరించాలని కేంద్ర వైద్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news