విద్యుత్ సంక్షోభం : రాష్ట్రాల‌కు కేంద్రం కీల‌క ఆదేశాలు

బొగ్గు కేటాయింపులు, విద్యుత్ సరాఫరా అంతరాయాల పై రాష్ర్టాల నుండి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో అన్నీ రాష్ట్రాలకు కేంద్ర విద్యుత్ శాఖ లేఖ రాసింది. ప్రస్తుతం బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుండి డిమాండ్ పెరిగిందని.. కొన్ని రాష్ట్రాలు వినియోగదారులకు విద్యుత్ సరఫరా చేయడం లేదని, పలు ప్రాంతాల్లో లోడ్ షెడ్డింగ్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు లేఖలో పేర్కొంది.

మరో వైపు అదే రాష్ట్రాలు పవర్ ఎక్సేంజ్ లో అధిక ధరలకు కరెంటు అమ్ముతున్నట్లు కూడా తమ దృష్టికి వచ్చిందని.. ఎవరికీ కేటాయించని కేటగిరీలో వుండే విద్యుత్ ను ఆయా రాష్ట్రాలు వినియోగదారులకు సరఫరా చేసేందుకు ఉపయోగించుకోవాలని తెలిపింది. మిగులు విద్యుత్ వివరాలు తెలియజేస్తే, ఆ మిగులును అవసరం వున్న రాష్ట్రాలకు కేటాయిస్తామని స్పష్టం చేసింది. పవర్ ఎక్సేంజ్ లో విద్యుత్ ను అమ్ముతున్నట్లు కానీ, కేటాయించని కేటగీరి విద్యుత్ ను వాడుకోలేకపోయినట్లయితే ఆయా రాష్ట్రాలకు ఆ కేటగిరీ కింద కరెంటు కేటాయింపును తాత్కాలికంగా తగ్గించడం లేదా ఉపసంహరించడం జరుగుతుందని.. ఆ విద్యుత్ ను అవసరం ఉన్న ఇతర రాష్ట్రాలకు కేటాయిస్తామని చెప్పింది. కేంద్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థల వద్ద వుండే ఎవరికీ కేటాయించిన కేటగిరీలో ని విద్యుత్ ను ఆయా రాష్ర్టాల అవసరరాలను బట్టి కేటాయించనున్న కేంద్రం… మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో కేటాయింపు నిబంధనల ప్రకారం ఎవరికీ కేటాయించిన కేటగిరీలో 15 శాతం విద్యుత్ ఉన్నట్లు వెల్లడించింది. .