ఆత్మహత్య ఎవరూ చేసుకోవద్దు.. అండగా ఉంటాం : చంద్రబాబు

-

న్యాయస్థానాలు ఆదేశించినా ఉపాధి హామీ బిల్లులు ఎందుకు ఇవ్వడం లేదు.? అని జగన్ సర్కార్ పై ఫైర్ అయ్యారు టీడీపీ అధినేత చంద్రబాబు. గ్రామాలను అభివృద్ధి చేసిన కాంట్రాక్టర్లపై కక్ష సాధింపులా.? కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా వేధించడం దుర్మార్గమన్నారు. జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ రావడం లేదని మండిపడ్డారు. అభివృద్ధి పనులు చేపట్టడానికి కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని.. ఏలూరులో రంజిత్ అనే కాంట్రాక్టరుకు బిల్లులు ఇవ్వకుండా వేధించడంతో ఆత్మహత్యాయత్నం చేశారని నిప్పులు చెరిగారు.

chandrababu naidu

రంజిత్ కు మెరుగైన వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు. గ్రామాల అభివృద్ధికి కృషి చేసిన కాంట్రాక్టర్లల్లో ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఉన్నారని.. చేసిన పనులకు ప్రభుత్వం బిల్లులను చెల్లించకపోవడంతో టెండర్లు వేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు రూ.80 వేల కోట్ల మేర కాంట్రాక్టర్లకు ఏపీ ప్రభుత్వం బకాయిలు పెట్టిందని ఫైర్ అయ్యారు. కాంట్రాక్టర్లెవరూ ఆందోళనతో ఆత్మహత్యలకు పాల్పడవద్దు.. టీడీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Latest news