టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ మరియు హీరోయిన్ లావణ్య త్రిపాఠిలు పెళ్లి సమయం రానే వచ్చింది. ఇటలీలో గ్రాండ్ గా జరగనున్న వీరి వివాహానికి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి కాగా రేపు పెళ్లి జరగనుంది. కాగా టాలీవుడ్ నుండి చాలా మంది ప్రముఖులు ఈ వివాహానికి హాజరు కానున్నారు. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ పెళ్లిని చూడడానికి నాగ చైతన్య మరియు సమంతలు కూడా విడివిడిగా వెళ్లినట్లు జాతీయ మీడియా తెలిపింది. ఇక వీరిద్దరూ కూడా ప్రేమించు పెళ్లి చేసుకోగా మనస్పర్థలతో గతంలోనే విడాకులు తీసుకున్నారు. ఇక వీరితో పాటుగా రష్మిక మందన్న కూడా పెళ్లి అటెండ్ అవనుందట. రేపు పెళ్లి అయిన తర్వాత నవంబర్ అయిదవ తేదీన చాలా గ్రాండ్ గా హైదరాబాద్ లో రిసెప్షన్ ను చేయనున్నారు.
ఈ వేడుకకు అధిక సంఖ్యలో సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు. కొంతకాలంగా ప్రేమించుకుంటున్న వీరిద్దరూ ఎట్టకేలకు రేపు వివాహబంధంతో ఒక్కటి కానున్నారు.