గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ సీనియర్ నాయకుడు మరియు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమయం అస్సలు కలిసి రావడం లేదు అని చెప్పాలి. 52 రోజులుగా జైలులో ఉండి ఈ రోజునే మధ్యంతర బెయిల్ మీద విడుదల అయిన బాబుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. చంద్రబాబు తరపున లాయర్లు విజయవాడ ఏసీబీ కోర్ట్ లో వేసిన ఒక పిటిషన్ ను విచారణకు కూడా అర్హత లేదని చెప్పి డిస్మిస్ చేసింది. ఇంతకీ ఈ పిటిషన్ ఏమిటంటే, చంద్రబాబును సిఐడి పోలీసులు అరెస్ట్ చేసిన సమయంలో ఆ అధికారుల కాల్ డేటా ను అడిగింది. ఈ పిటిషన్ ను బాగా పరిశీలించిన ఏసీబీ కోర్ట్ … ఈ పిటిషన్ కు విచారించే అర్హత కూడా లేదంటూ, అధికారుల భద్రత మరియు స్వేచ్ఛలకు భంగం కలుగుతుంది అన్న సిఐడి వాదనలతో ఏకీభవించి కొట్టివేసింది.
చంద్రబాబు అరెస్ట్ అయ్యి 24 గంటలు కూడా గడవక ముందే ఈ కేసును కొట్టివేయడం నిజంగా గట్టి ఎదురుదెబ్బే అని చెప్పాలి.