టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు చలపతిరావు 78 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. గుండెపోటుతో ఈరోజు తెల్లవారుజామున ఆయన తుది శ్వాస విడిచినట్లు సమాచారం. అనారోగ్య సమస్యలతో కొంతకాలంగా నటనకు దూరంగా ఉన్న ఈయన..ఇలా ఉన్నట్టుండి స్వర్గస్తులవడం నిజంగా విషాదకరమని చెప్పాలి.. కృష్ణాజిల్లా బల్లిపర్రులో 1944 మే 8 న జన్మించారు. చలపతిరావుకు ఒక కుమారుడు , ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు . సుమారుగా ఇండస్ట్రీలో 1200 సినిమాలకు పైగా నటించి తనదైన ముద్ర వేసుకున్నారు.
ప్రముఖ దిగ్గజ నటుడు కైకాల సత్యనారాయణ మరణం మరవకముందే మరో దిగ్గజ నటుడి మరణం సినీ ఇండస్ట్రీని పూర్తిస్థాయిలో విషాదంలో ముంచేసింది. నిర్మాతగా చలపతిరావు ఏడు సినిమాలను నిర్మించారు ఆయనను ఇండస్ట్రీలో అంతా బాబాయి అంటూ ప్రేమగా పిలిచేవారు. ఆయన విలన్ గా కూడా అనేక సినిమాలలో నటించారు. చలపతిరావు నటించిన మొదటి సినిమా గూడచారి 116.. చివరిగా నాగార్జున మూవీ బంగార్రాజులో కనిపించారు చలపతిరావు.
మొత్తానికైతే వరుస మరణాలు చోటు చేసుకుంటూ ఉండడం నిజంగా ఇండస్ట్రీని ఒంటరిని చేస్తోందని పలువురు తమ అభిప్రాయాలుగా వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఇదే ఏడాది కృష్ణంరాజు, కృష్ణ, కైకాల సత్యనారాయణ, ఇప్పుడు చలపతిరావు ఇంతమంది దిగ్గజాలు కోల్పోవడం నిజంగా బాధాకరమైన విషయం అని చెప్పాలి.