BIG BREAKING : సీనియర్‌ నటుడు చలపతిరావు మృతి

-

తెలుగు చిత్రసీమలో మరో విషాదం చోటు చేసుకుంది. నిన్నటికి నిన్న ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ మృతిని మరవకముందే.. సీనియర్‌ నటుడు చలపతిరావు ఈరోజు ఉదయం కన్నుమూశారు. తెల్లవారుజామున గుండెపోటుతో చలపతిరావు మృతి చెందారు. 1200కు పైగా సినిమాల్లో చలపతిరావు నటించారు. ఆయన స్వస్థలం కృష్ణాజిల్లా పామర్రు మండలంలోని బల్లిపర్రు. నాన్న పేరు మణియ్య.

Telugu actor Chalapathi Rao's sleazy comment on women kicks off a storm |  Deccan Herald

అమ్మ వియ్యమ్మది పక్కనే ఉన్న మామిళ్ళపల్లి. ఆయనకు ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. ఆడపిల్లలు అమెరికాలో ఉంటారు. అయితే.. గత కొంతకాలంగా చలపతిరావు నటనకు దూరంగా ఉంటున్నారు. అయితే.. చలపతిరావు మృతిపై సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. విలక్షణ నటుడిగా చలపతిరావు మంచి గుర్తింపు ఉంది. విలన్‌గా, తండ్రిగా, అన్నగా వివిధ పాత్రలో నటించి మెప్పించారు చలపతిరావు.

 

Read more RELATED
Recommended to you

Latest news