జీవితంలో వివాహం అనేది ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. యుక్త వయసుకు వచ్చిన తరువాత తన కంటూ ఒక ఉద్యోగం కానీ,వ్యాపారాన్ని గానీ మొదలుపెట్టిన అనంతరం లేదా అంత కన్నా ముందుగానే వివాహం వైపు పరుగులు తీస్తారు యువత.అయితే ఈ విషయంలో తప్పు చేసినా సరిదిద్దుకో వచ్చేమో గానీ వివాహం విషయంలో మాత్రం తొందర పడితే దాని పర్యవసానం జీవితాంతం ఉంటుందని అంటారు రాజనీతిజ్ఞుడు, తత్త్వవేత్త అయినా చాణక్యుడు..తన నీతి శాస్త్రంలో పేర్కొన్నాడు.
భాగస్వామి మనసును కొన్ని సమయాలు, సందర్బాలలో వ్యక్తం అవుతుంది అంటారు చాణక్యుడు. సంసారం సజావుగా ఉండాలంటే భార్యభర్తలు చాణక్యనీతి సూత్రాలు పాటించాలి అవేంటో ఇప్పుడు చూద్దామా..
భర్త కష్టాల్లో పేదరికంలో వున్నపుడే భార్య యొక్క నిజాయితి,ప్రేమ, అసలు వ్యక్తిత్వం బయటపడుతుంది. భర్తకు కష్టం కలిగి భార్య చెంతకు చేరితే ఏమీ కాదులెండి అని మీ కష్టానికి నేను తోడుగా వుంటాను అని చెప్పే భార్యనే నిజమైన భార్య అని అంటారు అని అంటున్నారు అపరమేధావి అయిన చాణక్యుడు.
ఇతరుల సంపాదలను చూసి కుళ్ళుకునే ఇల్లాలు వుంటే భార్య భర్తలమధ్య గొడవలు పెరిగి ఆ ఇల్లు నరకంగా మారుతుందంటారు చాణక్యుడు. భర్త సంపాదించిన దానిలో సంతోషంగా సర్దగలిగే భార్య దొరకడం వెయ్యి జన్మల అదృష్టంతో సమానం అంటారు చాణక్యుడు.
కుటుంబ పెద్దయినా భర్త నిజాయితీగా ఉండాలని, కష్టసుఖాలు, లాభానష్టాలు కుటుంబ సభ్యులతో పంచుకోవాలని, అప్పుడే సంసారం సజావుగా సాగుతుందంటారు చాణక్యుడు.
భర్త భార్యను కాపాడుకోవడానికి డబ్బు పోగొట్టుకోవాల్సి వస్తే.. ఏమాత్రం సంశయించొద్దన్నారు. డబ్బు పోతేపోయింది.. భార్యను వదులుకోవద్దన్నారు. అయితే, ఆత్మగౌరవం విషయానికి వస్తే భార్య, డబ్బు రెండింటినీ కోల్పోవడానికి కూడా సిద్దంగా ఉండే వారి ఇల్లు సుఖసంతోషాలతో ఉంటుందంటారు చాణక్యుడు.
భార్య చీటికీ మాటికీ కించపరుస్తూ అందానికి, డబ్బుకు విలువనిచ్చే భర్తవున్నా కుటుంబం నరకమే అంటారు చాణక్యుడు.భార్య అవసరాన్ని, మనసును అర్థం చేసుకొనే భర్త దొరకడం భార్య అదృష్టం అంటారు చాణక్యుడు.
ఇక పిల్లల విషయానికి వస్తే వారోక మట్టిముద్దలాంటి వారు. ఆ ముద్దను ఎలా తీర్చిదిద్దితే అలా బొమ్మై కూర్చుంటుంది అంటారు చాణక్యుడు. ప్రేమానురాగాలు, గౌరవ మర్యాదలు,మంచి చెడులు మనము ఏవి పాటిస్తే వారు కూడా అవే అలవర్చుకుంటారు.