క్లీన్ స్వీప్ జిల్లాలో కారుకు కష్టాలు.. ఐదు సీట్లు గల్లంతే?

-

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా..అధికార టీఆర్ఎస్ పార్టీకి కంచుకోట…తెలంగాణ ఉద్యమం మొదలైన దగ్గర నుంచి జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి ఆదరణ ఉంది. గతంలో జిల్లాలో టీడీపీ-కాంగ్రెస్ పార్టీలు పోటాపోటిగా ఉండేవి…కానీ తెలంగాణ వచ్చాక…ఇక్కడ వన్ సైడ్ గా టీఆర్ఎస్ విజయాలు సాధిస్తూ వస్తుంది. 2018 ఎన్నికల్లో జిల్లాలోని 9 సీట్లని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. జిల్లాలో ఉన్న బోధన్, నిజామాబాద్ అర్బన్, రూరల్, బాల్కొండ, ఆర్మూర్, జుక్కల్, బాన్సువాడ, ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్ధులు విజయం సాధించారు.

ఇలా జిల్లాని కైవసం చేసుకున్న టీఆర్ఎస్ పార్టీకి…2019 నుంచి సీన్ రివర్స్ అయింది. ఎప్పుడైతే పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ లో కవిత ఓటమి పాలైందో..అప్పటినుంచి జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి కష్టాలు మొదలయ్యాయి. నిజామాబాద్ పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకున్న బీజేపీ…అనూహ్యంగా జిల్లాలో పుంజుకుంటూ వస్తుంది. పార్లమెంట్ ఎన్నికల్లోనే పలు అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ మెజారిటీ సాధించింది. నిజామాబాద్ జిల్లాలో ఉన్న ఆర్మూర్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ స్థానాల్లో బీజేపీకి లీడ్ వచ్చింది. బోధన్, నిజామాబాద్ అర్బన్ లో మాత్రమే టీఆర్ఎస్ పార్టీక లీడ్ వచ్చింది.

అంటే నిజామాబాద్ లో బీజేపీ హవా మొదలైందనే చెప్పొచ్చు. ఇక ఈ మూడేళ్లలో జిల్లాలో రాజకీయం చాలా మారింది…టీఆర్ఎస్ పార్టీకి పోటీగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వచ్చాయి. పైగా జిల్లాలో సగం మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత కనిపిస్తోంది. అసలు వారికి మళ్ళీ గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి.

ఆ విషయం ఐప్యాక్ సంస్థ సర్వేలోనే బయటపడిందని టీఆర్ఎస్ వర్గాల సమాచారం. మళ్ళీ జిల్లాలో ముగ్గురు, నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వడం కష్టమని కూడా తెలిసింది. అయితే ఎన్నికల్లోపు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇంకా గట్టిగా కష్టపడి పనిచేసి పికప్ అయితే..దాదాపు ఐదు సీట్లలో కారు పార్టీకి గెలుపు కష్టమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి క్లీన్ స్వీప్ చేసిన జిల్లాలోనే కారుకు డ్యామేజ్ అయ్యేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news