ప్రధాని మోదీకి….., ….. ఉండాలి… చంద్రబాబు..

-

ప్రధాని నరేంద్ర మోదీ ఏ మొఖం పెట్టుకుని ఏపీకి వస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఆయన ఈ రాష్ట్రానికి ఏం చేశారని ప్రశ్నించారు. ఆయన రాష్ట్రానికి ఇచ్చిన దాని కంటే మేం కేంద్రానికి కట్టిన పన్నులే అధికంగా ఉన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏపీపై కుట్ర పూరితంగా వ్యవహరిస్తుందన్నారు.  ఏపీలో అస్థిర, కీలుబొమ్మ ప్రభుత్వం రావాలని నరేంద్ర మోదీ కోరుకుంటున్నారని ఆరోపించారు ఏపీ సీఎం చంద్రబాబు.

ఇళ్లు కట్టినా, రోడ్లు వేసినా కొందరికి నచ్చడం లేదని.. ఏపీలో అభివృద్ధి జరుగుతోందని మోదీకి కోపంగా ఉందన్నారు. మోదీ తన దగ్గర ఉన్న డబ్బుతో ఎన్నికల్లో ప్రజలను ప్రభావితం చేయాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో తెదేపా ప్రభుత్వం అందించిన సుపరిపాలనపై శ్వేతపత్రం విడుదల చేసిన  అనంతరం మీడియాతో మాట్లాడుతూ… కేంద్రం, ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.  దేశంలోని అన్ని రాజ్యాంగబద్ధమైన వ్యవస్థల్ని భ్రష్టుపట్టించారని మండిపడ్డారు. ఈవీఎంల నిర్వాహణను కొన్ని ప్రైవేటు కంపెనీలకు ఇవ్వడాన్ని తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. పేపర్ బ్యాలెట్ విధానానికి వెళ్తే సమస్య ఏమిటని ప్రశ్నించారు. అమెరికా వంటి అనేక దేశాలలో ఈవీఎంలను నమ్మడం లేదని.. పేపర్ బ్యాలెట్ విధానాన్నే అనుసరిస్తున్నాయన్నారు. దేశంలో ప్రజాస్వామ్యానికి తీవ్ర ముప్పువాటిల్లినట్లు బాబు వివరించారు. కేంద్రం మెడలు వంచాలంటే భాజపా వ్యతిరేక రాష్ట్రాలు ఏకం కావాలని ఆకాంక్షించారు.

Read more RELATED
Recommended to you

Latest news