భారీగా పెరిగిన ఎస్టీ పంచాయతీలు…

-

తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు ప్రభుత్వం ఖరారు చేసింది. దీంతో మొత్తం 12751 పంచాయతీల్లో ఎస్టీలకు 3146, బీసీలకు 2345 పంచాయతీలు, ఎస్సీలకు 2113 పంచాయితీలు,  జనరల్ కేటగిరీలకు 5147 పంచాయితీలు కేటాయించారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుత రిజర్వేషన్లతో ఎస్టీ పంచాయతీలు అధికంగా పెరిగాయి. వీటితో పాటు  షెడ్యూల్‌ ఏరియాల్లో 1281 పంచాయతీలు ఉండగా.. అందులో 641 మహిళలకు, 640 ఎస్సీ జనరల్ కేటగిరీలో చేర్చారు. 100 శాతం ఎస్టీ జనాభా వున్న గ్రామ పంచాయతీల్లో 589 మహిళలకు రిజర్వ్ చేశారు.. 588 జనరల్ ఎస్టీలకు కేటాయించారు. బీసీ పంచాయితీల్లో 1173 మహిళలకు కేటాయించగా .. 1172 బీసీ జనరల్ కేటగిరీలో కేటాయించారు. జనరల్ కేటగిరీకి మొత్తం 5147 పంచాయితీలను కేటాయించగా.. 2574 మహిళలకు, 2573 జనరల్ కేటగిరీలో చేర్చారు.

మొత్తం 12751 గ్రామ పంచాయితీల్లో మహిళలకు 6378 మహిళలకు, జనరల్ కేటగిరీలకు 6373 గ్రామ పంచాయితీలను కేటాయించారు. పంచాయతీల్లో రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత త్వరలోనే ఈసీ గ్రామ పంచాయతీ ఎలక్షన్ల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఎన్నడూ లేని విధంగా మొన్నటి వరకు తండాలుగా ఉన్న గ్రామాలను… తెరాస అధినేత కేసీఆర్ గ్రామ పంచాయతీలుగా మర్చారు… దీంతో తమ తండాలను తామే పాలించుకునే అవకాశం రావడంతో గిరిజన ప్రాంతాల్లో పండగ  వాతావరణం నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news