రాహుల్ – బాబు ల ప్రచారం ఎప్పుడో తెలుసా?

-

మహాకూటమిలో భాగంగా తెలంగాణలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ… తెదేపా అధినేత చంద్రబాబు ఉమ్మడి ప్రచారానికి ఈ నెలలో రెండు రోజుల పాటు డేట్స్ ఫిక్స్ అయ్యాయి… తెలంగాణలో తెరాసను ఓడించి అధికారం చేపట్టాలనే ఉద్దేశంతో ఏర్పడిన మహాకూటమి పొత్తులో భాగంగా ఇరు పార్టీల నేతలు 28,29 తేదీల్లో ప్రచారం నిర్వహించనున్నారు. ఒకే వేదికను రాహుల్ – చంద్రబాబు పంచుకుంటూ వారి ప్రచారాన్ని నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. తెదేపా అభ్యర్థులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో ఏపీ మంత్రులు సైతం ప్రచారానికి వస్తారని తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్. రమణ వెల్లడించారు.

తెలంగాణలో ప్రచారం కోసం సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్‌తో ఆరు పాటలు రాయించిన తెదేపా, వాటిని వందేమాతరం శ్రీనివాస్‌, ఇతర గాయకులతో స్వరపరిచి తెలంగాణ భావాన్ని వ్యక్తం చేయనున్నారు. రాజకీయ ఎత్తుల్లో భాగంగా ఎన్నడు లేని విధంగా అనైతిక కాంగ్రెస్ – తెదేపా పొత్తును ఓటర్లు ఏవిధంగా స్వాగతిస్తారనే విషయం తెలుసుకోవాలంటే ఫలితాల వరకు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news