ఇదివరకు ఓటేయాలంటే బ్యాలట్ పత్రాలే. వాటి మీద మనకు నచ్చిన పార్టీ గుర్తు మీద స్టాంప్ వేసి దాన్ని మడిచి బాక్స్ లో వేసి రావాల్సి ఉండేది. ఇక.. ఆ పద్ధతి ఓటింగ్ కోసం చాలా డబ్బు ఖర్చుతో పాటు.. అదనపు ప్రయాస. కాగితాలు వేస్ట్. వాటిని ట్రాన్స్ పోర్ట్ చేయడం… వాటిని దాయడం, లెక్కించడం… చాలా కష్టంగా మారేది. వాటి ట్యాంపరింగ్ తోనూ చాలా సమస్యలు వచ్చేవి.
కానీ.. ఇప్పుడు ఓటేసే విధానమే మారిపోయింది. మన దగ్గర 2009 ఎన్నికల నుంచి ఈవీఎంలను వాడటం ప్రారంభించింది ఈసీ. వీటి వల్ల.. కాగితం ప్రింటింగ్ అవసరం ఉండదు. చాలా సులభంగా వాటిని తరలించవచ్చు.. ఓటు వేసే విధానం కూడా చాలా ఈజీగా ఉంటుంది. లెక్కించడం.. ఇలా అన్నింటినీ చాలా ఈజీగా చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఎమ్ 3 టైప్ ఈవీఎంలను ఈసీ ఉపయోగిస్తున్నది. ఆ టైప్ ఈవీఎం ధర సుమారు రూ.17 వేలు ఉంటుంది. అయితే.. దాని ధర ఎక్కువే అయినప్పటికీ.. చాలా ఎన్నికలకు దాన్ని ఉపయోగించడం వల్ల చాలా ఆదా అవుతుంది.