8 ఏళ్ల తర్వాత భద్రాద్రికి చంద్రబాబు.. పార్టీ శ్రేణుల్లో ఆనందం‌

-

దాదాపు 8 ఏళ్ల తర్వాత తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు భద్రాచలంలో అడుగు పెట్టారు. దీనితో తెదేపా శ్రేణులు, అభిమానులు సంబురాలు చేసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెంలో పర్యటిస్తోన్న చంద్రబాబు… వరద బాధితులను పరామర్శించి.. రేపు రామయ్యను దర్శించుకోనున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తెదేపా అధ్యక్షులు చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. నేడు బుర్గంపాడు, సారపాక గ్రామాల్లోని వరద బాధితులను పరామర్శించి….రేపు భద్రాద్రి రామయ్యను దర్శించుకోనున్నారు. అనంతరం భద్రాచలంలో ముంపునకు గురైన వరద బాధితుల ఇండ్లకు వెళ్లి పరామర్శించనున్నారు. 2014లో భద్రాచలం వచ్చిన చంద్రబాబు మళ్లీ 8 ఏళ్ల తర్వాత భద్రాచలం రావడంతో తెదేపా శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.

మరోవైపు ఇటీవల వరద బీభత్సానికి గోదావరి పరివాహక ప్రాంతాల్లో జనజీవనం అతలాకుతలం అయ్యింది. బడుగుజీవులు తమ నివాసాలు నేలకూలడంతో.. నిలువ నీడ కరవై నానాపాట్లు పడుతున్నారు. పరీవాహకంలో వచ్చిన భారీ వరదలకు కొందరి గృహాలు పూర్తిగా, మరికొందరివి పాక్షికంగా కూలిపోయాయి. భద్రాద్రి జిల్లాలోని ఏడు మండలాల్లో 7500 కుటుంబాలను వరదలు కోలుకోలేని దెబ్బతీశాయి. వందల గ్రామాలు రోజుల తరబడి మునిగిపోగా 27 వేల మంది బాధితులు పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నారు. వీరందరిని చంద్రబాబు పరామర్శించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news