బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ జూన్ 22 నాటికి 20 వసంతాలు పూర్తి చేసుకుంది. దివంగత మాజీ ప్రధాని వాజ్పేయి చేతులమీదుగా ప్రారంభమైన ఈ సంస్థ 20 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. బసవతారకం ట్రస్ట్ చైర్మన్ నందమూరి బాలకృష్ణను ఈ అభినందించారు. బాలకృష్ణ తన తండ్రి దివంగత ఎన్టీ రామారావు ఆశయాలను తిరుగులేని అంకితభావంతో నెరవేర్చుతున్నారని చంద్రబాబు ప్రశంసించారు. అలాగే భవిష్యత్తులోనూ మరిన్ని సేవలు అందించాలని, ప్రతి అంశంలోనూ వారికి మంచి జరగాలని కోరుకుంటున్నట్టు ట్వీట్ చేశారు. అలాగే గత 20 ఏళ్లుగా పేదలకు సేవలు అందిస్తున్నారంటూ ఆసుపత్రి వర్గాలను ప్రశంసించారు.
Congratulations to Basavatarakam Indo American Cancer Hospital for successfully completing 20 yrs in service of the poor. Balakrishna Garu is fulfilling the dream of late Sri NT Rama Rao Garu with his exemplary dedication. I wish them the very best for all future endeavours pic.twitter.com/7k3FznhG4z
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) June 22, 2020