ప్రజలు సంతోషంగా ఉండడం చంద్రబాబుకు ఇష్టం ఉండదని ఎద్దేవా చేశారు సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి. ప్రతిపక్షంలో ఉండి ఏ మంచి జరిగినా తట్టుకోలేకపోతున్నారని అన్నారు. మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందితే ఏడుస్తారు.. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు పడితే ఏడుస్తారని అన్నారు. కరువుకు కేరాఫ్ అడ్రస్ ఎవరంటే బాబే అని చెబుతారని ఎద్దేవా చేశారు.
మేనిఫెస్టో ను చెత్తబుట్ట లో పడేసింది ఎవరంటే బాబే అంటారని, ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచింది బాబే అంటారని, తెలుగుదేశం పార్టీని, ట్రస్టును లాక్కున్నది ఎవరంటే చంద్రబాబే అంటారని, రాష్ట్ర విభజనకు తొలి ఓటు వేసింది చంద్రబాబే అంటారని, చంద్రబాబు అండ్ కో, దుష్ట చతుష్యం మనల్ని చూసి ఏడుస్తున్నాయని అన్నారు. పేద పిల్లలను ఇంగ్లీష్ మీడియం లో చదివిస్తే ఏడుస్తారని, వికేంద్రీకరణ చేస్తామన్న ఏడుస్తారని.. అలాంటి ప్రతిపక్షంతో మనం కాపురం చేస్తున్నాం అని అసెంబ్లీలొ వ్యాఖ్యానించారు సీఎం జగన్.