తెలంగాణాలో బీజేపీ జెండా ఎగురెయ్యాలనే ఉత్సాహం బీజేపీ నేతల్లో ఆవిరైపోయిందా…? అంటే అవుననే సమాధానమే వినపడుతుంది. పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు ఎంపీ స్థానాలు గెలిచి ఎన్నో ఆశలు పెట్టుకున్న బీజేపి తర్వాత తర్వాత ఒక్కసారి కూడా తన ప్రభావం చూపించలేకపోయింది. త్రిపురలో కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని కూల్చిన ఆర్ ఎస్ ఎస్ సహకారంతో తెలంగాణాలో కూడా కేసిఆర్ ని గద్దె దింపే ఆలోచన చేసారు.
కాని పంచాయితీ ఎన్నికల్లో కూడా బీజేపి ప్రభావం చూపించలేదు. గత నెలలో సంఘ్ హైదరాబాద్ లో సమావేశాలు నిర్వహించి తెలంగాణాలో క్షేత్ర స్థాయిలో అడుగుపెట్టాలని భావించగా కేసీఆర్ మొగ్గలోనే ఆ ఆశలను తుంచేసారు. మున్సిపల్ ఎన్నికల్లో మంత్రులకు ఎమ్మెల్యేలకు కేసీఆర్ కీలక బాద్యతలు అప్పగించారు. దీనితో బీజేపి వైపు చూస్తున్న స్థానిక నాయకత్వాన్ని వాళ్ళు టార్గెట్ చేసారు. వాళ్ళకు ఏం కావాలో దగ్గరుండి చూస్తున్నారు.
పట్టణ ప్రాంతాల నుంచి ముందు బలపడాలని చూసిన బీజేపికి ఇది ఇబ్బందిగా మారింది. బీజేపీలో హుషారుగా ఉండే స్థానిక హిందూ నేతలను టీఆర్ఎస్ టార్గెట్ చేయడంతో ఎటూ పాలుపోని పరిస్థితుల్లో బీజేపి ఉంది. రాష్ట్ర పార్టీలో ఉన్న కీలక నాయకులు కూడా కేసీఆర్ ను దాటి ఆలోచించే పరిస్థితి రాష్ట్రంలో లేదు. దీనితో మున్సిపల్ ఎన్నికల్లో వాళ్ళూ ఎంపీ స్తానాలు గెలిచిన నియోజక వర్గాల్లో కూడా ప్రభావం చూపించే అవకాశం లేదనే అంటున్నారు.