మళ్లీ ముఖ్యమంత్రి అవుతా… అందరి లెక్కలు తేల్చుతా : చంద్రబాబు

మళ్ళీ సీఎంగానే శాసనసభ కు వెళ్తా అని చెప్పాను… నేను మరోసారు సిఎం అయ్యి.. అసెంబ్లీ గౌరవం కాపాడుతానని చంద్రబాబు పేర్కొన్నారు. కుప్పం నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన ఇవాళ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షం పట్ల తమిళనాడులో స్టాలిన్ ఎంత గౌరవం గా ఉన్నారు…ఇక్కడ జగన్ ఎలా ఉన్నాడని.. పార్టీ లో ఉన్న ప్రతి కార్యకర్త కు నేను అండగా ఉంటా…ఏ కార్యకర్త పై ఒక్క దెబ్బపడినా…నా పై పడినట్లేనని పేర్కొన్నారు.

chandrababu naidu

క్యాడర్ ను ఇబ్బంది పెడుతున్న ఏ ఒక్కరినీ వదిలి పెట్టనని.. మూడు రోజుల పాటు గ్రామాల్లో పర్యటిస్తా…కార్యకర్తలు, ప్రజలను కలుసుకుంటానని వెల్లడించారు. నేను ఎప్పుడూ కుప్పం అభివృద్ధి గురించే ఆలోచించానని.. నిత్యావసరాలు తీవ్ర భారం గా మారిపోయాయని చెప్పారు. పొరుగున ఉన్న రాష్ట్రం లో పెట్రో ధరలు 10 రూపాయలు తక్కువగా ఉందని.. ఎవడబ్బ సొమ్మని OTS కు 10 వేలు కట్టమని అడుగుతున్నారని మండిపడ్డారు.

వాలంటీర్లు బెదిరిస్తే భయపడకండి…టీడీపీ వచ్చిన తరువాత పేదల ఇళ్లకు ఉచితం గా రిజిస్ట్రేషన్ చేయిస్తామని.. నన్ను కూడా బుతులు తిట్టే పరిస్థితి కి వచ్చారని ఫైర్ అయ్యారు. రౌడీయిజం చెయ్యడం ఒక్క నిమిషం పని… కానీ అది మన విధానం కాదని చెప్పారు. కుప్పం లో టీడీపీ కార్యకర్తలను, ప్రజలను ఇబ్బంది పెడుతున్న వారి పేర్లు రాసి పెడుతున్నా …అందరి లెక్కలు తేల్చుతామని హెచ్చరించారు.