ఇటలీ లోని మిలాన్ నుంచి అమృత్‌సర్ వచ్చిన విమానంలో కరోనా కలకలం రేగింది. దాదాపుగా 125 మంది ప్రయాణికులకు కరోనా పాజిటివ్ గా తేలింది. మొత్తం ఫ్లైట్ లో 179 మంది ఉంటే ఇందులో 125 మందికి కోవిడ్ సోకడం ఆందోళన కలిగిస్తోంది. ప్రయాణికలు అమృత్‌సర్ చేరుకున్న తర్వాత ప్రయాణికులకు పాజిటివ్ వచ్చినట్లు ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ వీకే సేథ్ తెలిపారు.
ఇదిలా ఉంటే ఇటలీలో ఉన్నప్పుడు తమకు నెగిటివ్ వచ్చిందని.. ఇప్పుడు ఎలా పాజిటివ్ వస్తుందని ప్రయాణికులు ఆందోళనలో ఉన్నారు. ప్రస్తుతం కరోనా పాజిటివ్ వచ్చిన వారిని క్వారంటైన్ లో ఉంచుతామని అధికారులు చెబుతున్నారు.
దేశంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈరోజు లక్షకు చేరువలో కరోనా కేసులు నమోదయ్యాయి. వారం రోజులుగా రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. గతంలో రోజుకు 10 వేలకు దిగువనే కేసులు నమోదయ్యేవి. దీంతో పాటు దేశంలో ఓమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయి. దేశంలో 26 రాష్ట్రాలకు ఓమిక్రాన్ కేసులు విస్తరించాయి. దేశంలో ఇప్పటి వరకు 2600పైగా కేసులు నమోదయ్యాయి.