స్పీకర్ ఆఫర్: చంద్రబాబు ఇజ్జత్ కా సవాల్!

-

40 ఇయర్స్ ఇండస్ట్రీ టీడీపీ అధినేత చంద్రబాబుకు తన జీవితంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండదేమో! ఆయనను అంతలా భయపడేలా చేస్తున్నవి రెండే రెండు… ఒకటి జగన్, రెండోది కరోనా! అవును… ఇంతకాలం రాజకీయ ప్రత్యర్ధులతోనే ఇబ్బందిపడిన ఆయనకు కరోనా మరోతలనొప్పిగా తయారైంది. ఆ కరోనానే ఆయనను రాష్ట్రంలో ఉండకుండా చేసింది.. ఆ  కరోనానే విశాఖ బాధితులను పరామర్శించకుండా చేసింది.. ఆ కరోనానే అవినీతికి అక్రమాలకు పాల్పడి జైల్లో ఉన్న తమ నేతలను పరామర్శించే అవకాశం కూడా లేకుండా చేస్తుంది. ఈ పరిస్థితుల్లో బాబుకు ఒక క్లిష్టమైన సమస్య వచ్చింది. అదే… ఈనెల 16 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించబోతున్నారన్న వార్త!

ఈ సమావేశాలకు వెళ్లాలా వద్దా… బాబును తీవ్రంగా తొలిచేస్తున్న ప్రశ్న ఇది! వెళ్లకపోతే జగన్ కి భయపడ్డారు అంటారు.. వెళ్తే కరోనా భయం! ఈ కీలక సమయంలో బాబు నెత్తిన పాలుపోసే అవకాశం కల్పించారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం. 60 ఏళ్లు పైబడిన ఎమ్మెల్యేలు సభకు హాజరు కావడం వారి ఇష్టమని.. అనివార్యం కాదని.. ఆ వయసు దాటిన వారు భయం ఉంటే సభకు రానక్కర్లేదని సూచించారు! ఎందుకంటే 60 ఏళ్లు దాటిన వారికి కరోనా డేంజర్ కదా!

ఈ క్రమంలో 70 ఏళ్లు దాటిన టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇప్పుడు స్పీకర్ ఆఫర్.. ఇజ్జత్ కా సవాల్ గా మారింది. దీంతో బాబు అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలనే నిర్ణయించారు! అవును… అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలని చంద్రబాబు నిర్ణయించారు. టీడీపీ నేతల అరెస్టుల నేపథ్యంలో నిరసనగా అసెంబ్లీకి నల్లచొక్కాలు వేసుకుని వెళ్లాలని, అనంతరం సభ నుంచి వాకౌట్ చేయాలని టీడీఎల్పీ సమావేశంలో నిర్ణయించారు! ముందుగానే వాకౌట్ చేయాలని ఫిక్సయ్యి వెళ్లడమా… ఇంతోటి దానికి అవసరమా అంటే.. దానికీ బాబుదగ్గర ఒక లాజిక్ ఉంది. శాసనసభకు వెళ్లని పక్షంలో మండలిలో బిల్లులు పెట్టి ఆమోదింపజేసుకుంటారని అనుమానమట!

ఏది ఏమైనా… ఏపీ అసెంబ్లీ సమావేశాలకు చంద్రబాబు హాజరవుతున్నారు.. నల్లదుస్తులా, తెల్ల దుస్తులా, పసుపు దుస్తులా అన్నది కాదు పాయింట్ ఇక్కడ… వెళ్తున్నరంతే! వైకాపా నేతలు మాటేసుకుని కూర్చున్నా… కరోనా కాటేస్తాదనే భయమున్నా… బాబు వెళ్తున్నారంతే! అసెంబ్లీలో ఉంటారా.. వాకౌంట్ చేసి వచ్చేస్తారా అన్నది.. తర్వాత సంగతి!!

Read more RELATED
Recommended to you

Latest news